చాలా మందికి డబ్బు అత్యవసరం అయినప్పుడు ఆన్లైన్ లోన్ తక్షణ పరిష్కారంగా కనిపిస్తుంది. అయితే కొంతమంది మోసగాళ్లు మీ అవసరాన్ని ఆసరాగా తీసుకొని లాభం పొందడానికి ప్రయత్నిస్తుంటారు. నాన్-పబ్లిక్ లోన్ స్కామ్‌ల గురించి తెలుసుకుంటే మోసాల బారిన పడే అవకాశం ఉండదంటున్నారు పోలీసులు. రుణం తీసుకోవడానికి ముందస్తుగా మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదని వివరిస్తున్నారు. రుణం మంజూరు చేయడానికి డబ్బులు అడగడంతోనే మోసం ప్రారంభం అవుతుందని గుర్తించమంటున్నారు. లోన్ తీసుకోండి నెలనెలా కొంత మొత్తాన్ని తీర్చేయండి అని ఫోన్లో మెసేజ్ చూసి నమ్మారో...నట్టేట మునిగినట్టేనంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.


మీ క్రెడిట్ లావాదేవీల స్కోర్‌తోపాటు అనేక అంశాలపైన రుణ ఇవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది. ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే త్వరలో గడువు ముగిసే అవకాశం ఉంది. వెంటనే రుణం తీసుకోండి అంటనే మోసం అని గ్రహించాలి. ఇలాంటి ప్రకటన కనిపిస్తే జాగ్రత్త పడాలి. బ్యాంకులో ఇటువంటి అత్యవసర మార్గాన్ని సృష్టించి రుణాలు ఇయ్యవనే విషయాన్ని గుర్తించాలి. సైబర్ మోసగాళ్లు లాటరీ స్కామ్‌ల పేరుతో ఎర వేసి మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలుసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్‌ల కోసం ప్రజలు తరచు సెర్చ్ చేసే ఉత్పత్తులను ఆసరగా చేసుకొని కూడా బోల్తా కొట్టించాలని చూస్తారు. 


ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం రోజులలో  రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు పరిశీలిస్తే ప్రజల్ని ఎంతలా సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారో అర్థమవుతుంది. 


1. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు Rupee king, rupee box, prime rupee, rupee star, credit bus వంటి అప్లికేషన్లలో లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బులు చెల్లించేసినా కట్టలేదని బెదిరింపులకు దిగారు. బంధువులు, స్నేహితులకు కాల్ చేసి పరువు తీస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. కొందరికి కాల్ చేశారు కూడా. 


2. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి తన ఫేస్‌కుబుక్‌లో తెలియని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. వారిద్దరూ వాట్స్అప్ నెంబర్లు మార్చుకొని న్యూడ్ కాల్ చేసుకున్నారు. ఆ అమ్మాయి ఈ న్యూడ్ కాల్ ని రికార్డ్ చేసి మీరు నాకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది లేకుంటే న్యూడ్‌ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరించింది. 


3. గోదావరిఖని టూ టౌన్ పరిదికి చెందిన ఒక బాధితుడికి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మీకు 25 లక్షల లాటరీ వచ్చింది, ఈ లాటరీ డబ్బులు మీరు పొందాలి అంటే రిజిస్ట్రేషన్ ఫీ, ఇన్కమ్ టాక్స్ వంటివి చెల్లించాలి అంటూ చెప్పింది. ఇలా చెప్పి 34 వేలు మోసం చేశారు.


4. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు ఒక కొరియర్ పంపించాడు. కొన్ని రోజుల తర్వాత సైబర్ నేరగాడు బాధితుడికి కాల్ చేసి మీరు పంపిన కొరియర్ డెలివరీ అవ్వలేదు, మీరు ఆరు రూపాయలు ట్రాకర్ కి రీఛార్జి చేస్తే కొరియర్ డెలివరీ అవుతుంది అని చెప్పి ఒక లింకు పంపించాడు. బాధితుడు హడావుడిలో ఆ లింకు ఓపెన్ చేయగానే ఫోన్ పేటీఎం ఓపెన్ అయింది, తన పాస్వర్డ్ ప్రెస్ చేయగానే బాధితుడు ఎకౌంటు నుంచి Rs. 99 వేలు కట్ అయింది. 
తీసుకోవాల్సిన జాగ్రత్త :- తాత్కాలిక అవసరాల కోసం ఎటువంటి లోన్ యాప్ లలో కూడా లోన్స్ తీసుకోవద్దు. మీకు లోన్ శాంక్షన్ అయింది అంటూ మెసేజ్లు వస్తే పట్టించుకోవద్దు అందులో ఉన్న లింక్ ని క్లిక్ చేయొద్దు


5. చెన్నూర్ పొలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడికి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి ముద్ర ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్ మని పరిచయం చేసుకొని.. లోన్ వచ్చిందని చెప్పి కొంత మొత్తం కట్టించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసే ఆ నెంబర్‌ పని చేయలేదు. తాను మోసం పోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. 


6. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితుడు తన మొబైల్ ఫోన్‌ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు. సైబర్ నేరగాడు బాధితుడికి కాల్ చేసి ఏ లింకు పంపించి అందులో డబ్బులు పంపిస్తానని తీసుకుంటే ఇద్దరికీ క్యాష్‌ బ్యాక్ వస్తుందని చెప్పాడు. ముందు ఒక రూపాయి పంపి చూడమన్నాడు. అతను అదే చేస్తే రూపాయికి రూపాయి క్యాష్ బ్యాక్ వచ్చింది. దీంతో నమ్మిన బాధితుడు 6500 సైబర్ నేరగాడికి పంపించాడు. తరువాత ఎటువంటి సమాచారం లేదు


7. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడిని సైబర్ నేరగాళ్లు ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్‌ చేశారు. ఆ గ్రూపులో గేమ్స్ ఆడండి డబ్బులు గెలవండి అంటూ పలు రకాల లింకులు పోస్ట్ చేశారు. సైబర్ నేరగాడు ఆ లింకుల పైన పలుసార్లు క్లిక్ చేయగా అతని అకౌంట్ నుంచి 15 వేలు కట్ అయ్యాయి. 


8. హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి సైబర్ నేరగాడు కాల్ చేసి అతని షాప్‌లో కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాడు. డబ్బులు పే చేస్తాను అని చెప్పి తనకు బార్‌కోడ్‌ వాట్సాప్‌లో సెండ్ చేశాడు. ఆ బార్‌కోడ్‌ స్కాన్ చేయగానే బాధితుడు అకౌంట్ నుంచి డబ్బులు పోయాయి.


9. అంతర్గాన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడుకి సైబర్ నేరగాడు కాల్ చేసి తాము ఓ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌ నుంచి కాల్ చేస్తున్నామని.. ఒక కార్ గిఫ్ట్‌గా వచ్చిందని కలరింగ్ ఇచ్చారు.  ఆ కారు పొందాలి అనుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కోసం కొంత డబ్బులు పే చేయాలి అని చెప్పగా బాధితుడు 6500 పంపించాడు. అంతే ఫోన్ స్విచ్చాఫ్. 


10. మందమరి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రేడింగ్ గురించి ఒక పేజీని చూశాడు. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేశాడు. దాని కొంత డబ్బులుచెలిస్తే లాభాలు రెట్టింపు చేసే ఐడియా చెప్తానన్నాడు. తాము ట్రేడింగ్ చేసి లాభాలు తిరిగి పంపిస్తాను అని చెప్పగా రూ. 45 వేలు పంపించి మోసపోయాడు. 


పోలీసులు ఏమంటున్నారంటే?



  • సోషల్‌మీడియాలో వచ్చే యాడ్స్‌ అన్నీ భ్రమ పడి డబ్బులు పంపొద్దు. 

  • గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అనుమతించవద్దు.

  • మీ వ్యక్తిగత ఫోటోలు వివరాలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచొద్దు.

  • లాటరీ వచ్చింది అని, క్రెడిట్ కార్డులు రివార్డు పాయింట్స్ వచ్చాయి కాల్ చేసినా పోస్టులు పంపించిన నమ్మకండి.

  • ఎవరైనా లింకులు పంపించి ఆ లింకుల ద్వారా మనీ సెండ్ చేయండి అంటే నమ్మకండి.

  • లోన్‌ వచ్చిందని కాల్‌ చేస్తే వెంటనే నమ్మేయొద్దు.

  • ఆన్‌లైన్‌ వస్తువులు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు వాళ్లు పంపిన లింక్‌లకు డబ్బులు పంపిచొద్దు. బార్‌కోడ్స్‌ స్కాన్ చేయొద్దు.

  • సోషల్ మీడియాలో మీకు తెలియని వ్యక్తులు ఏదైనా గ్రూప్‌లో యాడ్‌ చేస్తే జాగ్రత్త పడండి. ప్రయోజనకరంగా లేకపోతే ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం ఉత్తమం.