Konaseema Crime : ఆటోల్లోనూ, బస్సుల్లోనూ ప్రయాణం చేసే మహిళలే ఆమె టార్గెట్. పరిచయం లేకపోయినా సరదాగా మాట కలిపి లేదా పిల్లలను నవ్వుతూ ఆడిస్తూ ఎంతో కలివిడితనాన్ని ప్రదర్శిస్తుంది.  అరె ఈమె ఇట్టే కలిసిపోతుందే అనుకునేంత లా బిహేవ్ చేసి బురిడీ కొట్టించి ఉన్నదంతా ఊడ్చేస్తుంది. ఈ కిలాడీ లేడీని అమలాపురం పోలీసులు ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు.  



అసలేం జరిగింది?  


ఈనెల 16వ తేదీన భీమనపల్లి నుంచి అమలాపురం ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగ్ దొంగిలించారు కిలాడి లేడీలు. లబో దిబో మంటూ బాధిత మహిళ అమలాపురం పట్టణ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కిలాడీ లేడీలను పట్టుకునే పనిలో పడ్డారు. వీరిని పట్టుకునేందుకు కొందరు మహిళా కానిస్టేబుళ్లను బృందంగా ఏర్పాటు చేశారు. వీరు దొంగతనాలు ఎలా పాల్పడుతున్నారు అనే విషయంపై నిఘా ఉంచి అమలాపురం నుంచి వెళ్తోన్న పలు ఆటోలపై  నిఘాపెట్టారు. ఆర్టీసీ బస్సులపైనా నిఘా ఉంచారు. దీంతో  అమలాపురం నుంచి ఉప్పలగుప్తం వైపు వెళ్తున్న ఆటోలో ఈ మహిళను గమనించి ఫాలో అయ్యారు. చివరకు పోలీసులకు దొంగ సొత్తుతో అడ్డంగా బుక్కయింది మహిళా దొంగ. 


7.5 లక్షల బంగారం స్వాధీనం 


ఈ మహిళా దొంగ నుంచి 7.5 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు అమలాపురం పట్టణ సీఐ కొండలరావు తెలిపారు.  తిరుపతికి చెందిన కోయ లక్ష్మీ కోనసీమ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ పలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. కోయ లక్ష్మి అలియాస్ బోయ జ్యోతిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ కొండల రావు తెలిపారు. 


బైక్ దొంగలు అరెస్ట్ 


పల్నాడు జిల్లా బెల్లంకొండ మండల పరిధిలో అడ్డ రోడ్డు వద్ద బైక్ దొంగలు పట్టుబడ్డారు. ఎస్.ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించారు పోలీసులు. బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు నిందితులు. వారి దగ్గర తొమ్మిది బైక్ లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బైక్ చోరీలకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


Also Read : Eluru News : ఏలూరు జిల్లాలో విషాదం, బైక్ పై విద్యుత్ వైర్ పడి అన్నదమ్ములు సజీవదహనం


Also Read : Nellore: ఫ్రెండ్ భార్యపై యువకుడు అత్యాచారం, తట్టుకోలేక విషం తాగిన భార్యాభర్తలు!