జూలై ఒకటో తేదీన పూరీలో జరిగే జగన్నాథ రథ యాత్రకు హాజరయ్యే టూరిస్టులు, భక్తుల కోసం వైజాగ్ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనుంది ఈస్టుకోస్టు రైల్వే. ప్రతీ ఏటా జ్యేష్ఠ పూర్ణిమ రోజున పూరీలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలకు పుణ్యస్నానం చేయిస్తారు. ఆలయ గర్భగుడిలో ఉంచి తలపులు మూసేస్తారు. 15 రోజుల తరువాత వారిని ఊరేగింపుగా తీసుకెళ్లే రథయాత్ర దేశ వ్యాప్తంగా బాగా ఫేమస్. ఈ ఏడు జులై ఒకటిన ఈ రథయాత్ర జరుగనుంది. దీనికి లక్షల సంఖ్యలో భక్తులు, టూరిస్టులూ హాజరవుతుంటారు. అలాంటి వారిలో వైజాగ్ నుంచి వెళ్లే వారికోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది .
ప్రత్యేక రైళ్లు ఇవే
1)వైజాగ్ -పూరీ స్పెషల్ ట్రైన్ (08907/08908 )
ఈ ట్రైన్ జూన్ 30వ తేదీన వైజాగ్‌లో మధ్యాహ్నం 02:30 కి బయలుదేరి జులై ఒకటో తేదీన ఎర్లీ అవర్స్‌లో 1:15కి పూరీ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో పూరీలో జూలై ఒకటో తేదీ రాత్రి 11:15కి బయలుదేరి జులై రెండో తేదీ ఉదయం 09:30కి వైజాగ్ చేరుకుంటుంది .
ఈ ట్రైన్ ఏపీలో కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, నౌపాడ, పలాస, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్‌లలో ఆగుతుంది.
2)జగదల్ పూర్ -పూరీ (08909/08910)
ఈ ట్రైన్ జగదల్ పూర్‌లో 30. 06. 2022న సాయంత్రం 6:30 కి బయలుదేరి జులై ఒకటి మధ్యాహ్నం 12:35కి పూరీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జులై ఒకటి రాత్రి 08:05కి పూరీలో బయలుదేరి జూలై రెండు మధ్యాహ్నం ఒంటిగంటకు జగదల్పూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఏపీలో పార్వతీపురం టౌన్, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, నౌపాడ, పలాస, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్‌లలో ఆగుతుంది.
3)గుణుపూరు -పూరీ (08418/08417)
ఈ ట్రైన్ గుణుపూర్‌లో 30. 06. 2022న రాత్రి 11:30 కి బయలుదేరి జులై ఒకటి ఉదయం 09:25కి పూరీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జులై రెండు రాత్రి 01:45కి (ఒకటో తారీఖు అర్ధరాత్రి ) పూరీలో బయలుదేరి జులై రెండు ఉదయం 11:30కు గుణుపూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఏపీలో పాతపట్నం,టెక్కలి, నౌపాడ, పుండి, పలాస, మందస రోడ్, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్‌లలో ఆగుతుంది అని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది . ఉత్తరాంధ్ర ప్రయాణికులకోసం ఈ స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటుచేశామని రైల్వే అధికారులు తెలిపారు .