డబ్బు ఎంత చెడ్డ పని చేసేందుకైనా ఉసిగొల్పుతుందని అనేందుకు ఇదో ఉదాహరణ. రూ.100 డబ్బు కోసం ఓ నిండు ప్రాణం పోయింది. అందుకు కారణమైన మరో వ్యక్తి కటకటాల పాలయ్యాడు. కేవలం రూ.100 నోటు చేసిన మాయ ఇది. కూలి నాలి చేసుకొనే వారి మధ్య తలెత్తిన ఈ వివాదంతో రెండు కుటుంబాల్లో తీవ్రమైన విషాదం నెలకొంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. స్థానికంగా ఈ హత్య తీవ్ర చర్చనీయాంశం అయింది.
Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలీ డబ్బులు రూ.100 కోసం ఓ వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. బతుకుదెరువు కోసం ఖమ్మం జిల్లాకు వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య రూ.100 నోటు అగ్గిరాజేసింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రఘునాథ పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 మంది కూలీలు 2 నెలల కిందట రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజరకు వ్యవసాయ పనుల కోసం వచ్చారు. ఈ క్రమంలో వారంతా కూలీ పనులు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు.
Also Read : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలాఖరుకు పీఆర్సీ !
అయితే కూలీ పనుల కోసం దయాళ్, సేత్‌రాం అనే ఇద్దరు స్నేహితులు కూడా వచ్చారు. ఈ క్రమంలో ఓ రైతు వద్ద పని చేయగా వచ్చిన కూలీ డబ్బుల విషయంలో దయాళ్, సేత్‌రాంల మధ్య వాగ్వాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ చాలా సేపు గొడవపడ్డారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో క్షణికావేశానికి గురైన సేత్‌రాం.. చాకుతో దయాళ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు.
అసలే మద్యం మత్తులో ఉన్న ఆయన చాకుతో ఏకంగా ఛాతీపై బలంగా పొడిచేశాడు. దయాళ్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: Revanth Reddy: డీఎస్‌ను కలిసిన రేవంత్.. ఆయన ఇంటికెళ్లి భేటీ, కారణం ఏంటంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి