ABP  WhatsApp

Punjab Congress Update: పట్టువీడిన సిద్ధూ.. అధిష్ఠానం చర్చలు సఫలం.. పీసీసీ చీఫ్ పదవికి ఓకే!

ABP Desam Updated at: 14 Oct 2021 09:14 PM (IST)
Edited By: Murali Krishna

పంజాబ్ పీసీసీ చీఫ్ పదవిని నవజోత్ సింగ్ సిద్ధూ తిరిగి చేపడతారని కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ ప్రకటించారు. సిద్ధూతో చేసిన చర్చలు సఫలమైనట్లు ఆయన తెలిపారు.

పట్టు వీడిన సిద్ధూ

NEXT PREV

పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభానికి తెరపడినట్లు కనిపిస్తోంది. నవజోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్‌ పదవిలో కొనసాగుతారని పంజాబ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ హరీశ్ రావత్ ప్రకటించారు. 







కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని నవజోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేశారు. అధిష్ఠానం నుంచి నాకు వచ్చిన సూచనల ప్రకారం సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగాలి. పార్టీని వ్యవస్థీకృతంగా నిర్మించాలి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రేపు రానుంది.                                          - హరీశ్ రావత్, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్


హరీశ్ రావత్ వ్యాఖ్యలపై సిద్ధూ సానుకూలంగా స్పందించారు. 







పంజాబ్, పంజాబ్ కాంగ్రెస్‌కు సంబంధించి నా సమస్యలను అధిష్ఠానానికి స్పష్టంగా చెప్పాను. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా అది కాంగ్రెస్, పంజాబ్ మంచి కోసమే. వారి ఆదేశాలే నాకు శిరోధార్యం.                                            - నవజోత్ సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ నేత


పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభంపై చర్చించేందుకు నేడు సిద్ధూ.. ఏఐసీసీ కార్యాలయానికి వచ్చారు. సిద్ధూ లేవనెత్తిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పంజాబ్ ఏఐసీసీ ఇంఛార్జ్ హరీశ్ రావత్ హామీ ఇచ్చారు. కొన్ని అంశాలు పరిష్కారం కావడానికి కొంత సమయం పడుతుందని హరీశ్ ఈ సందర్భంగా అన్నారు.


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సిద్ధూతో భేటీ అనంతరం హరీశ్ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సెప్టెంబర్ 28న సిద్ధూ రాజీనామా చేశారు. అయితే దీనిని పార్టీ అంగీరించలేదు. పదవికి రాజీనామా చేసినప్పటికీ పార్టీలో కొనసాగుతానని సిద్ధూ స్పష్టం చేశారు. అయితే ఎట్టకేలకు సిద్ధూను ఒప్పించి మళ్లీ పదవిని అప్పజెప్పడంలో కాంగ్రెస్ అధిష్ఠానం సఫలమైంది.


Also Read: CBSE Term-1 board exams: 10, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ కీలక ప్రకటన.. పరీక్షలు ఎప్పుడంటే?


Also Read: Varun Gandhi Tweet on Farmers: వాజ్‌పేయీ మాటలతో మోదీ సర్కార్‌కు వరుణ్ గాంధీ చురకలు


Also Read: Amit Shah on Pakistan: 'పాక్.. జాగ్రత్త!.. మితిమీరితే ఇక చర్చలు ఉండవు.. మెరుపుదాడులే'


Also Read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్‌తో ఉన్నది ఎవరు?.. వైరల్ సెల్ఫీలో వ్యక్తిపై లుక్ఔట్ నోటీసు!


Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 14 Oct 2021 09:12 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.