Karimnagar News : సోషల్ మీడియోలో ఓ వ్యక్తి పెట్టిన పోస్టు వివాదాస్పందం అయింది. ఈ విషయం అక్కడితో ఆగలేదు పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో వివాదం మరింత పెరిగింది. పోలీసులు లాఠీలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారంటూ బాధితుడి ఆరోపణలు చేస్తున్నారు. నడవలేని పరిస్థితిలో కాళ్లకు గాయాలయ్యాయని మీడియా ముందు వాపోయారు.
అసలేం జరిగింది?
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే, టీఆరెస్ నాయకులను ఉద్దేశించి టీఆర్ఎస్ కార్యకర్త తొంటి పవన్ ఆ పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఒక పోస్ట్ చేశారు. ఓ కుల సంఘాల భోజనాలకు వచ్చిన టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వాడిన పదజాలం అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను ఉద్దేశించి పోస్ట్ పెట్టడంటూ పవన్ పై పార్టీ మండల అధ్యక్షుడు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అతనిపై చట్టపరమైన చర్యలకు తీసుకోకుండా కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే చెబితే వదిలేస్తామంటూ చెప్పి పవన్ ను తీవ్రంగా కొట్టారు. పవన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని విపరీతంగా కొట్టారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యేని ఉద్దేశించి కాదు
పోస్టు పెట్టింది నేనే. మా వాళ్లను ఉద్దేశించి పెట్టాను. నేను 20 సార్లు పైగా ఎమ్మెల్యే దగ్గరు వెళ్లాను. పండుగకు రావాలని ఇన్విటేషన్ కూడా ఇచ్చాం, వస్తానన్నారు. బుధవారం రోజు వస్తానంటే ఆదివారం రోజే ఫ్లెక్సీలు కట్టాం. బుధవారానికి అన్ని ఫ్లెక్సీలు చింపేశారు. మళ్లీ బుధవారం కొత్త ఫ్లెక్సీలు తెచ్చికట్టాం. అయినా సార్ రాలేదు. మళ్లీ ఇంకో పండగ జరుగుతోంది. ఎమ్మెల్యే వస్తారని ఫ్లెక్సీ కట్టాం. మళ్లీ చింపేశారు. ఇలా చింపేశారని మండల ప్రెసిడెంట్ కు చెప్పాను. ఆ తర్వాత ఎమ్మెల్యే వచ్చారు. మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారితో కలిసి ఆయన ఉన్నారు. వాళ్లను ఉద్దేశించి పోస్టు పెట్టాను. సార్ ను ఉద్దేశించి కాదు. పోలీసులు 20 నిమిషాలు ఆగకుండా కొట్టారు. - -తొంటి పవన్ , బాధితుడు
అనుచిత వ్యాఖ్యలు నేరం
టీఆర్ఎస్ నేతలు ఓ పండుగ సందర్భంగా భోజనాలు చేస్తున్నప్పుడు ఓ ఫొటో తీసుకున్నారు. ఆ ఫొటోపై తోంటి పవన్ అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంగళంపల్లి నివాసి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయి. అయితే అభ్యంతరకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నేరం. అందుకే పిలిచి విచారించాం- .- చొప్పదండి ఎస్ఐ రాజేష్