కుటుంబ కలహాలతో భార్య భర్తను హత్య చేసిన ఉదాంతం కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. డీఎస్పీ సోమనాథం తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి పట్టణంలోని అజంపురా కాలనీకి చెందిన ఆఫ్రోజ్(38) పట్టణంలో అల్లం వెల్లుల్లి వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఇతనికి భార్య ఫర్జానా, పదేళ్ల కొడుకు ఉన్నారు. రోజు మద్యం సేవించి తనను మానసికంగా వేధించేవాడని ఫర్జానా ఆరోపిస్తుంది. ఆ బాధలు భరించలేని ఫర్జానా సోమవారం రాత్రి ఆఫ్రోజ్ నిద్రపోయిన తర్వాత చున్నీని ఆఫ్రోజ్ గొంతును బిగించి హత్య చేసింది. దాంతో ఆఫ్రోజ్ మృతి చెందాడు. ఆఫ్రోజ్ గొంతుకు గాయమైనట్టుగా పోలీసులు గుర్తించారు.
Also Read: కన్న బిడ్డల్ని బావిలోకి నెట్టేసిన సీఆర్పీఎఫ్ జవాను! వెంటనే పరారీ.. కారణం ఏంటంటే..
కేసులో మరో కోణం
అయితే ఫర్జానాకు ఆఫ్రోజ్ రెండో భర్త. మొదటి భర్తతో విడిపోయి ఆఫ్రోజ్ ను పెళ్లి చేసుకుంది. మొదటి భర్తకు సుమారు 15 సంవత్సరాల కుమారుడు ఉండగా అతను ఫర్జానాతోనే ఉంటున్నాడు. రెండో భర్త అయిన ఆఫ్రోజ్ కు ఇద్దరు కొడుకులు. కాగా ఒక కుమారుడు చనిపోయాడు. అయితే ఆఫ్రోజ్ ను ఫర్జానానే హత్య చేసిందా లేదా ఆమెకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్రోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి డీఎస్పీ సోమనాథం జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. నిందితురాలు ఫర్జానాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టుగా సమాచారం.
Also Read: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..
ప్రియుడి మోజులో భర్తను హత్య
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామానికి చెందిన మొద్దు వెంకటేష్ అనే 37 ఏళ్ల వ్యక్తికి బుద్దారం గ్రామానికి చెందిన మాధవితో పదేళ్ల కిందటే పెళ్లి జరిగింది. అయితే, భార్య మాత్రం నాగర్ కర్నూల్‌కు చెందిన జంగం రమేష్ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని రహస్యంగా కొనసాగిస్తోంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన జంగం రమేశ్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం కాగా.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం చివరకు భర్తకు తెలిసిపోయింది.
భర్త వెంకటేష్ తన భార్యను వివాహేతర సంబంధం గురించి నిలదీశాడు. దీంతో భార్య భర్తను ఎలాగైనా అంతం చేయాలని నిశ్చయించుకుంది. పొలం పనులకు వెళ్లి వచ్చిన భర్త ఆదివారం రాత్రి ఎప్పటిలా భోజనం చేసి నిద్ర పోతున్న సమయంలో చంపాలని ప్రణాళిక వేసింది. అప్పటికే, వేసిన ప్లాన్ ప్రకారం.. భార్య మాధవి రమేష్‌తో కలిసి భర్త వెంకటేష్ గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే భర్త శవాన్ని మధ్యలో ఉంచుకొని బైక్‌పై ముగ్గురూ నాయినోని పల్లి శివారులో మెయిన్ రోడ్డుపై వేసి రోడ్డు ప్రమాదం చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అలా వెళ్తుండగా మధ్యలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. వీరిని గుర్తించిన హన్వాడ పోలీసులు ప్ర ధాన రహదారిపై వారిని ఆపేశారు. భయంతో ఇద్దరూ మృతదేహాన్ని వదిలి పారిపోతుండగా వెంబడించి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.