Kadapa Crime : కడప నగరంలో సంచలనం సృష్టించిన అయాన్ అనే బాలుడి హత్య కేసును కడప చిన్నచౌకు పోలీసులు  చేధించారు. నగరంలోని ఓం శాంతి నగర్ లో ఈ నెల 3న బాలుడు అయాన్  ఆశ్రిత్ కుమార్ ను అతడి మేనత్త, మామలు హత్య చేశారు. ఈ హత్య కేసులో నిందితులైన మేనత్త ఇంద్రజ, ఆమె భర్త అంజన్ కుమార్ లది ప్రేమ వివాహం. అయితే తన  ప్రేమ వివాహాన్ని అంగీకరించని అన్న శివకుమార్ పై కక్ష పెంచుకున్న ఇంద్రజ, ఉపాధి కోసం కువైట్ కు వెళ్లిన అన్న శివకుమార్, భాగ్యలక్ష్మి దంపతులు తమ కుమారుడిని నానమ్మ వద్ద  వదిలివెళ్లారు. అయితే మాయ మాటలతో మంచిగా చదివిస్తామని, బాగా చూసుకుంటామని నమ్మించిన మేనత్త ఇంద్రజ కడప నగరానికి తీసుకువచ్చింది. అయితే కడపకు తీసుకువచ్చిన మేనత్త, మామలు బాలుడిని చంపాలనే ఉద్దేశంతో చిత్రహింసలకు గురిచేశారు. బాలుడిని చలాకితో కాల్చి, వాతలు పెట్టి కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.  హత్య చేసిన అనంతరం పరారైన నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ విషయం తెలుసుకున్న నిందితులు కడప డిప్యూటీ తహసీల్దార్ ఎదుట లొంగిపోయారు. ఈ కేసును పోలీసులు నాలుగు రోజుల వ్యవధిలోనే చేధించారని అదనపు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.  


అసలేం జరిగింది? 


 ఓ బాలుడిని మేనత్త, మామలు చిత్రహింసలు పెట్టి హత్య చేసిన ఘటన కడప జిల్లాలో సంచలనం అయింది. అన్నమయ్య జిల్లా కోనాపురం హరిజనవాడకు చెందిన వెలగచెర్ల శివకుమార్, భాగ్యలక్ష్మి దంపతులు ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు కువైట్ కు వెళ్తూ పిల్లలను నానమ్మ, తాతయ్యల దగ్గర వదిలివెళ్లారు. పెద్ద కుమారుడు ఆశ్రిత్‌ కుమార్‌ (8)ను బాగా చదివిస్తామని శివకుమార్, భాగ్యలక్ష్మిల అనుమతితో కడప ఓంశాంతి నగర్‌లో ఉంటున్న మేనత్త ఇంద్రజ పది రోజుల క్రితం తీసుకెళ్లింది. ఇంద్రజ, ఆమె భర్త అంజన్‌ కుమార్‌ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఆశ్రిత్‌ కుమార్ ను తమ బిడ్డలాగా చూసుకుంటామని చెప్పిన వీరు పాత కక్షను మనసులో పెట్టుకుని చిత్రహింసలు పెట్టేవారు.


ఈ నెల 3న  


ఈ నెల 3వ తేదీ రాత్రి రోజూ లాగే మేనత్త, మామలు ఆశ్రిత్ కుమార్ ను తీవ్రంగా కొట్టారు. దీంతో బాలుడు దెబ్బతట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడ్ని రిమ్స్ కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో మేనత్త ఇంద్రజ దంపతులు వారి కుమార్తెను తీసుకుని పరారయ్యారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రిమ్స్‌ మార్చురీలోని బాలుడి మృతదేహాన్ని ఇటీవల కడప డీఎస్పీ శివారెడ్డి పరిశీలించారు.  పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలించగా కడప డిప్యూటీ తహసీల్దార్ ఎదుట లొంగిపోయారు. 


చదివిస్తానని నమ్మించి చిత్రహింసలు 


అంజన్‌కుమార్‌ను ఇంద్రజ మూడేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ వివాహాన్ని ఇంద్రజ అమ్మ, నాన్న, అన్న, వదినలు ఒప్పుకోలేదు. దీంతో వీరి కుటుంబాల మధ్య మాటలు లేవు. ఇటీవల ఇంద్రజ కుమార్తె పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ వీరి మధ్య సంబంధాలు మొదలయ్యాయి. అయితే అన్న తమ ప్రేమ వివాహాన్ని  ఒప్పుకోలేదనే కక్షతో మేనత్త బాలుడ్ని చదివిస్తానని నమ్మించి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టింది. ఆ దెబ్బలు తట్టుకోలేక బాలుడు చనిపోయాడు. అయితే బాలుడు చనిపోయాక తాము చేయరాని తప్పు చేశామని, ఆశ్రిత్‌ చనిపోయాడని ఇంద్రజ, కువైట్‌లో ఉన్న తన అన్న శివకుమార్‌కు వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌ చేసింది. తరువాత సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి భర్త, కుమార్తెతో కలిసి పారిపోయింది. బాలుడి తండ్రి శివకుమార్‌ తన తల్లిదండ్రులు, స్నేహితులు సమాచారమిచ్చాడు. వారు కడప రిమ్స్‌కు చేరుకుని బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.  


Also Read : Case On Janasena ZPTC : జనసేన జడ్పీటీసీపై తెలంగాణలో కేసులు - చేపపిల్లల కాంట్రాక్ట్ కోసం అంత పని చేశారా ?


Also Read : మరో యువకుణ్ని బలి తీసుకున్న లోన్ యాప్‌- పల్నాడులో 20 ఏళ్ల కుర్రాడు సూసైడ్‌