Case On Janasena ZPTC :   జనసేన పార్టీ జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడుపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు. నకిలీ గ్యారంటీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని, బ్యాంకులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించారని ప్రభుత్వ అధికారులు కేసు పెట్టారు. అక్వా వ్యాపారంలో ఉన్న గుండా జయప్రకాష్ నాయుడు తెలంగాణ మత్స్యశాఖ రెండు నెలల క్రితం  చెరువుల్లో చేప, రొయ్య పిల్లలు పెంచడానికి రూ.113 కోట్ల వ్యయంతో ఆహ్వానించిన టెండర్లలో పాల్గొన్నారు. కొంత మందితో కలిసి  12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేశారు. 


తెలంగాణలో చేప, రొయ్యపిల్లల సరఫరా కాంట్రాక్ట్ కోసం టెండర్లు 


వారికి కొన్ని టెండర్లు లభించాయి. బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి వాటిని పొందారు. వీరు పాలకొల్లులోని ఓ బ్యాంకు నుంచి నామమాత్రంగా బ్యాంకు గ్యారంటీ పత్రాలు తీసుకుని వాటి విలువలను భారీగా పోర్జరీ చేసి  , బ్యాంకర్ల సంతకాలు, బ్యాంకు స్టాంపులు అన్ని  ఫేక్‌ చేసి నకి లీ పత్రాలను తెలంగాణ మత్స్యశాఖకు సమర్పించారన్న ఆరోపణలు వచ్చాయి.  వీటిపై ఆరోపణలు రావడంతో  తెలంగాణ  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ విచారణకు ఆదేశించారు. పాలకొల్లులో జేపీ నాయుడు అండ్‌ టీం తీసుకున్న బ్యాంకు గ్యారంటీలను, వివరాలను తెలంగాణ అధికారులు సేకరించారు. బ్యాంకర్ల నుంచి తీసుకున్న మొత్తం లక్షల్లో ఉండగా కోట్లల్లో గ్యారంటీ సమర్పించారు. దీనిపై తె లంగాణ ప్రభుత్వం సదరు పాలకొల్లులోని బ్యాంకు నుంచి వివరాలు తీసుకుని నకిలీగా నిర్ధారించారు. 


ఫోర్జరీ పత్రాలు సమర్పించిన జీపీ నాయుడు 


మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, మంచిర్యాల‌, ఆసిఫాబాద్ జిల్లాల్లో చేప పిల్ల‌ల స‌ర‌ఫ‌రాకు కాంట్రాక్ట‌ర్లు స‌మ‌ర్పించిన టెండ‌ర్ బిడ్ల‌లో న‌కిలీ బ్యాంకు గ్యారెంటీ ప‌త్రాలు ఉన్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. దీంతో బ్యాంకు గ్యారెంటీలు ర‌ద్దు చేశామ‌ని రాష్ట్ర మ‌త్య్స‌శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ ప్రకటించారు.  స‌ద‌రు కాంట్రాక్టు ఏజెన్సీల టెండ‌ర్ బిడ్లుకూడా ర‌ద్దు చేయాల‌ని చేప పిల్ల‌ల అలాట్మెంట్లు కూడా క్యాన్సిల్ చేయాల‌ని ఈఎండీల‌ను ఫోర్ ఫిట్ చేయాల‌ని నిర్ణయించారు.   


కేసులు నమోదు చేసినట్లు సమాచారం - జీపీ నాయుడు కోసం పోలీసుల వెదుకులాట


నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రభుత్వాన్ని మోసం చేయడంపై మత్స్యశాఖ సీరియస్‌ అయి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  12 జిల్లాల్లో టెండర్లు దక్కించుకుని సుమారు రూ.8 కోట్ల మేర నకిలీ బ్యాంకు గ్యారంటీలను సృష్టించినట్లుగా భావిస్తన్నారు.  గుండా జయప్రకాష్‌నాయుడు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. తూర్పు గోదావరి జిల్లాలో వీరవాసరం మండలం నుంచి మంచి మెజార్టీతో జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అక్వా బిజినెస్‌లో మంచి ఫలితాలు రాబట్టారు. అయితే ఇలా తప్పుడు ఫోర్జరీ పత్రాలతో బ్యాంక్ గ్యారంటీలు సమర్పించడంతో కేసుల్లో ఇరుక్కున్నారు. 


జాతీయ పార్టీ పెట్టాలి .. తెలంగాణలాగే దేశాన్నీ బాగు చేయాలి - కేసీఆర్‌కు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల విజ్ఞప్తి !