జార్ఖండ్‌లోని గఢ్ వా జిల్లాలో సొంత సోదరిని బలి తీసుకున్న సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చేతబడి, తాంత్రిక చర్యల పేరుతో భర్త ఎదుటే ఆమె సోదరి, బావ ఈ ఘటనకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. ఆదివారం ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. గఢ్ వా నగరంలోని వార్డ్ నెంబరు - 6లోని ఓరాన్ తోలాలో మంత్ర తంత్రాలను నమ్మిన ఓ వివాహిత గుడియా దేవి(26)ని ఆమె సొంత సోదరి లలితాదేవి, బావ దినేష్ ఓరాన్ బలి తీసుకున్నారు. 


తాంత్రిక చర్యలు చేసే సమయంలో గుడియా దేవి నాలుక కూడా తెగిపోయి ఉందని మృతురాలి భర్త ఆరోపించాడు. అంతేకాక, ఆమె గర్భాశయం, ప్రేగులు కూడా ఆమె ప్రైవేట్ పార్ట్ నుంచి బయటకు తీశారని ఆరోపించాడు. ఆ వేదనను తట్టుకోలేని ఆమె మరణించిందని వివరించాడు. ఈ సంఘటన గత మంగళవారం జరగ్గా.. ఆదివారం (జూన్ 27) ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. పాత  కక్షల కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.


మృతురాలు గుడియా దేవి సోదరి అయిన లలితా దేవి, బావ దినేష్ ఓరాన్ ఇద్దరూ మేరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిలేలి గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మున్నా ఒరాన్ తన బావ దినేష్ ఒరాన్, అతని భార్య లలితా దేవి ఇద్దరూ తన పొరుగున ఉన్న రాంశరణ్ ఒరాన్ అలియాస్ గోటా ఇంటికి వారం క్రితం వచ్చారని చెప్పారు. ఈలోగా, లలిత తన సోదరి గుడియా దేవిని, బావ మున్నా ఒరాన్‌ను మంత్రాల కోసం రాంశరణ్ ఒరాన్ అలియాస్ గోటాను ఇంటికి పిలిచింది. మూడు-నాలుగు రోజులు నిరంతరంగా మంత్రప్రయోగాలు చేసిన తర్వాత, మంగళవారం ఉదయం కుటుంబ సభ్యుల కళ్ల ముందు, హతురాలి సోదరి, బావ కలిసి ఆమెను హత్య చేసినట్లుగా చెబుతున్నారు. 


చివరికి ఆమె ప్రైవేట్ పార్ట్ ద్వారా గర్భాశయం, పేగులను కూడా బయటకు తీశారు. ఆ వెంటనే ఆమె మరణించింది. మరణానంతరం, కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని మామ రంకా ప్రాంతం వద్దకు తీసుకెళ్లి మృతదేహాన్ని అక్కడ దహనం చేశారు.


అదుపులోకి ఐదుగురు నిందితులు
మంత్రి తంత్రాల వల్ల మహిళ బలి అయిందన్న సమాచారం అందుకున్న స్టేషన్‌ ఇన్‌చార్జి యోగేంద్ర కుమార్‌ ఆదివారం ఒరాన్‌ టోలాకు చేరుకుని విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తరువాత, స్టేషన్ ఇన్‌ఛార్జ్ యోగేంద్ర కుమార్ మృతురాలి భర్త మున్నా ఒరాన్, రామశరణ్ ఒరాన్ అలియాస్ గోటా ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్లు సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అందరినీ విచారణ జరుపుతున్నారు.


అక్రమ మద్యం వ్యాపారి రామ్ శరణ్ అలియాస్ గొట్టా ఒరాన్ పాత్ర అనుమానాస్పదంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. రామశరణ్‌ తంత్ర మంత్రాల నెపం వల్లే మహిళ బలి అయిందని చెబుతున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి రామశరణ్ రామ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.