తెలంగాణలోని జగిత్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల తారకరామనగర్‌లో ముగ్గురిని హత్య చేశారు. తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కుల సంఘం సమావేశం జరుగుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రాల నెపంతో ముగ్గురిని హత్య చేసినట్లు స్థానికులు అంటున్నారు. ఈ హత్యల సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ రూపేష్‌కుమార్, డీఎస్పీ ప్రకాశ్, సీఐ కృష్ణకుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసేందుకు కారణాలపై విచారణ చేపట్టారు.
Also Read: తెలంగాణలో మరో కుంభకోణం? గిడ్డంగుల సంస్థలో రూ.కోట్లు కాజేసేందుకు కుట్ర!
చిత్తూరు జిల్లాలో దారుణం
తాళి కట్టిన భర్తను భార్యే విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నరసారావు పేటకు చేందిన రవిచందర్‌కు గిద్దలూరుకి చేందిన వసుంధరకు 25 ఏళ్ళ క్రితం వివాహం అయ్యింది. అప్పటి నుండి రేణిగుంటలోని బుగ్గ వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. రవిచందర్ చిన్న పరిశ్రమను నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో తాను నడిపే పరిశ్రమ వద్ద ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా కొద్ది నెలల పాటు అక్రమ సంబంధం బయటకు రాకుండా రవిచందర్ రహస్యంగా కొనసాగించేవాడు.
Also Read: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
అయితే తన భర్తకు మరొక మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న వసుంధర తరచూ రవిచందర్‌తో గొడవ పడేది. భర్తను మందలించే ప్రయత్నం చేసింది. కానీ, భర్తలో ఎటువంటి మార్పు రాకపోవడంతో రవిచందర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను నిలదీసింది. అయినా పలితం లేకపోవడంతో రోజూ ఇంట్లో భర్తతో గొడవకు దిగేది. ఈ వివాదం కాస్త రోజు రోజుకి అధికం అయ్యేది. ఇంట్లో కుమారుడికి మతిస్తిమితం లేని కుమారుడిని చూసుకోవాల్సింది పోయి మరొక మహిళతో అక్రమ సంబంధం ఎందుకని వసుంధర గట్టిగా భర్తను నిలదీసేది. ఇలా మాట మాట పెరిగి.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఆ కోపంతో ఉన్న వసుంధర ఒక్కసారిగా భర్త రవిచందర్ పై ఓ కత్తితో దాడి చేసింది. రవిచందర్ ను అత్యంత క్రూరంగా హత్య చేయడమే కాకుండా అతని తలను, మొండేన్ని వేరు చేసి ఆ తలను ఓ కవర్‌లో వేసుకుని పోలీసులకు లొంగి పోయేందుకు ఆటోలో బయలు దేరింది. ఇంతలో ఆమె ఒంటిపై రక్తం మరకలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు వసుంధరను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తన భర్తతో విభేదాల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులకు వసుంధర తెలిపినట్లు సమాచారం.