జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మల్యాల మండలం రాజారం గ్రామ శివారులో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన వలస కూలీలుగా తెలుస్తోంది.
డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణ కూలీలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా అయిదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్యాల మండలం నూకపల్లి అర్బన్ కాలనిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో పని చేసే కూలీలు జగిత్యాలలో వంట సరుకులు కొనుగోళు చేసుకుని ఆటోలో బయలు దేరారు. రాజారం వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ను ఆటో ఢీకొనటంతో ఆటో పల్టీలు కొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న బత్తిని సంజీవ్ అక్కడిక్కడే మృతి చెందనగా మధు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన సుధాకర్, గోపాల్ మృతి చెందారు. కూలీలు జితేంద్ర, సురేశ్, హర్షకుమార్, బీహిను గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న మల్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం
కరీంనగర్ కమాన్ చౌరస్తాలో తెల్లవారుజామున ఓ కారు సృష్టించిన బీభత్సంలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. సీస కమ్మరి వృత్తి ద్వారా కత్తులు, గొడ్డళ్ళు తయారు చేసి విక్రయించుకునే వారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలో ఒక మహిళ చనిపోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారంతా నిరుపేద కుటుంబీకులు. ఈ రోజు ఆదివారం కావడంతో ఉదయం పూట కమాన్ చౌరస్తా లో తయారుచేసిన వస్తువులు అమ్ముకుంటారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన కూర్చున్న వారి పైకి కారు వేగంగా దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన కారు ఒక మహిళను ఢీ కొట్టి.. అనంతరం స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారుకు, స్తంభానికి మధ్య ఇరుక్కుపోయిన మహిళ అక్కడికక్కడే స్పాట్‌లోనే చనిపోయింది. దాదాపు ఈ ఘటనలో 9 మందికి గాయాలు కాగా వీరిలో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆసుపత్రిలో చనిపోయారు. కారు నడుపుతున్న వ్యక్తితో పాటు కారులో ఉన్న వాళ్ళు పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Also Read: కరీంనగర్ ఘోర ప్రమాదం మైనర్ల పనే... నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు