విద్యా బుద్దులు నేర్పమని స్కూలుకు పంపితే పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డాడో కీచక గరువు. 13 మంది విద్యార్థులపై ఏళ్ల తరబడి అత్యాచారం చేశాడు. చివరికి పాపం పండింది. మరణ శిక్ష పడింది. అయితే ఇది జరిగింది ఇండియాలో కాదు ఇండొనేషియాలో. ఇండోనేషియాలోని జావా రాష్ట్రంలో హెన్రి విరావన్ అనే 36 ఏళ్ల వ్యక్తి ఓ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూలును నడుపుతున్నాడు. అతనిపై నమ్మకంతో పలువురు తల్లిదండ్రులు విద్యార్థులను అక్కడ చేర్పించారు. దాన్నే అలుసుగా తీసుకున్న హెన్రి విరావన్ 13 మంది విద్యార్థినిలపై అత్యాచారానికి పాల్పడటం ప్రారంభించాడు.
భర్తకు కుక్కల మందు పెట్టి చంపిన భార్య, కారణం తెలిసి అవాక్కైన పోలీసులు
2016 నుంచి 2021 వరకూ ఈ దురాగతం నడిచింది. చివరికి పాపం ఎప్పటికైనా పండాల్సిందే. తాను చేసే అత్యాచారాల గురించి బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి చాలా కాలం పాటు వారిని సైలెంట్‌గా ఉంచాడు. 12 నుంచి 16 ఏళ్ల వయసు ఉన్న బాలికల్ని మాత్రమే టార్గెట్ చేసేవాడు. మొత్తంగా పదమూడు మందిని జీవితాల్ని ఇలా నాశనం చేశాడు. వీరిలో ఎనిమిది మంది వరకూ గర్భం దాల్చినట్లుగా తేలింది. విషయం తెలిసిన తర్వాత బాలికల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హెన్రి విరవన్‌పై పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపారు.
ప్రాణం తీసిన పోస్ట్ వెడ్డింగ్ షూట్- నదిలో కొట్టుకుపోయిన నవ జంట
విచారణ తర్వాత ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అయితే ఆ శిక్ష సరిపోదని.. మరణ శిక్ష విధించాలని బాధిత బాలిక తల్లిదండ్రులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు మరణశిక్ష విధించడమే సరైన శిక్షగా తేల్చింది. ఇండోనేషియాలో ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్నదేశం. అక్కడ విరివిగా ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్స్ ఉంటాయి. అలాంటి చోట్ల బాలికలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు కొంత కాలంగా వస్తున్నాయి. అక్కడి చైల్డ్ ప్రొటెక్షన కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
ఉద్యోగం రావడం లేదని బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, 2 వారాలపాటు ఆసుపత్రిలోనే, కానీ !
ఈ క్రమంలో ఇలాంటి నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మరణశిక్ష అమలు విషయంలో ఆ దేశంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నా.. హెన్రి ఒరావన్ విషయలో మాత్రం అందరూ స్వాగతించారు. ఇస్లామిక్ బోర్డింగ్ స్కూళ్లలో ఎక్కువ మంది నిరుపేదలే చేరుతూ ఉంటారు. అందుకే స్కూల్స్ నిర్వాహకులు దారుణంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.