ఈ మధ్య ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లు, సేవ్ ది డేట్ షూట్‌లు చాలా ఎక్కువైపోయాయి. అయితే వారి ఆనందం కోసం ఇలా చేసుకోవడంలో తప్పులేదు. అయితే కొన్ని ఫొటో షూట్‌లు మరీ సాహసోపేతంగా ఉంటున్నాయి. వీటి వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కేరళలో అలాంటి ప్రమాదమే జరిగింది. ఇందులో వరుడు మృతి చెందగా, వధువు పరిస్థితి విషమంగా ఉంది.


ఏం జరిగింది?


కోజికోడ్ సమీపంలోని కుట్టియాడికి చెందిన రెజిల్, కార్తీకకు మార్చి 14న వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత షూట్ కోసం వీరు కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు.


వీరి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దరినీ బయటకు తీశారు. అయితే అప్పటికే రెజిల్ మృతి చెందాడు. కార్తీక పరస్థితి విషమగా ఉంది. ఫొటో షూట్ పిచ్చితో వీరి జీవితం విషాదంగా మారింది.


వైరల్ షూట్


ఇటీవల కేరళలో 'మిన్నల్ మురళీ' పెళ్లి ఫొటో షూట్‌ వైరల్ అయింది. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన రవీంద్రన్ అనే వరుడు.. ‘మిన్నల్ మురళి’ గెటప్‌లో కొత్త పెళ్లి కూతురితో కలిసి పోస్ట్-వెడ్డింగ్ షూట్‌లో పాల్గొన్నాడు. వధువు చేతులు పట్టుకుని..  పంట పొలాల్లో అటూ ఇటూ పరుగులు పెడుతూ.. భలే సందడి చేశాడు. చివర్లో ఆమెతోపాటు గాల్లోకి ఎగిరేందుకు కూడా ప్రయత్నించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 






రవీంద్రన్ దీనిపై స్పందిస్తూ.. ‘‘మిన్నల్ మురళి గెటప్‌లో నన్ను చూడాలని మా కుటుంబ సభ్యులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. పెళ్లి రోజున మిన్నల్ మురళి దుస్తులు వేసుకోవాలని నా కజిన్స్ సలహా ఇచ్చారు. కానీ, కోవిడ్ వల్ల వారెవరూ నా పెళ్లికి రాలేకపోయారు. అందుకే ఆ గెటప్‌లో పోస్ట్-వెడ్డింగ్ షూట్ నిర్వహించాం’’ అని ఓ మీడియా సంస్థకు తెలిపాడు.


Also Read: Covid-19 New Variant XE: గుబుల్ గుబుల్‌గా గుండెలదరగా- కొత్త వేరియంట్ XE, 10 రెట్లు ఫాస్ట్ గురూ!