హైదరాబాద్‌లో బంజారాహిల్స్ పోలీసులు ఓ నకిలీ పోలీసు ఆటకట్టించారు. ఏకంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న అతణ్ని అరెస్టు చేశారు. పోలీసునంటూ బెదిరింపులకు పాల్పడేలా చేసి రూ.లక్షల్లో వసూలు చేస్తు్న్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ వైద్యుడికి ఫోన్ చేయించి ఏకంగా రూ.75 లక్షలు డిమాండ్ చేయించాడు. దీంతో పోలీసులకు బాధిత వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళిక ప్రకారం.. మాటు వేసిన పోలీసులు ఫేక్ పోలీస్‌ను అరెస్టు చేశారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో సదరు డాక్టర్ ఇంట్లోనే మహేష్ అనే ఈ నిందితుడు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన మాటల రికార్డింగ్‌లు, అన్నీ సేకరించాడు. ఇది గమనించిన వైద్యుడు మహేష్‌ను ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆ కోపంపై మహేశ్ మరో వ్యక్తితో నకిలీ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అవతారమెత్తించాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వాలని లేదంటే ఆడియో రికార్డింగ్‌లన్నింటినీ బయటపెడతానని బెదిరించాడు.


అసలేం జరిగిందంటే..
బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 13లో డాక్టర్ కృష్ణప్రసాద్‌ ఓ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. రెండేళ్ల కిందట వరంగల్‌కు చెందిన మహేష్‌ గౌడ్‌ ఇతని వద్ద డ్రైవరుగా చేరాడు. అయితే డాక్టర్ ఇంట్లో తన భార్యతో మాట్లాడిన కొన్ని సంభాషణలను అతడు తన సెల్‌ఫోన్లో రికార్డు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ ప్రసాద్‌ మహేష్‌ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ తర్వాత మహేష్ విశాఖకు చెందిన మరో ఉన్నతోద్యోగి వద్ద ట్రక్కు డ్రైవరుగా చేరాడు. అతడిని నమ్మించి వివిధ దఫాలుగా సుమారు రూ. 15 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో పక్కా ప్లాన్ వేశాడు. తనకు హైదరాబాద్‌లో తెలిసిన వైద్యుడు ఉన్నాడని, అతడిని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయవచ్చని గౌతం నాయర్‌ను నమ్మించాడు. ఇందుకు తనవద్ద ఉన్న ఆడియో క్లిప్‌లను వాడుకుందామని చెప్పాడు. అందుకు గౌతం నాయర్‌‌ కూడా ఒప్పుకోవడంతో అతడినే పోలీసు అధికారి వేషం వేయాలని సూచించాడు.


Also Read: Santosh Nagar Gang Rape: ఆ గ్యాంగ్ రేప్ ఉత్తిదే.. తేల్చేసిన పోలీసులు, ఆ యువతి మాస్టర్ ప్లాన్ ఎందుకంటే..


ప్లాన్ ప్రకారం.. ఈ నెల 14న నాయర్‌ నేరుగా వైద్యుడికి ఫోన్‌ చేసి తనను ఖమ్మం సీఐ దామోదర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఓ కేసులో మహేష్‌ గౌడ్‌ అరెస్ట్‌ అయ్యాడని, అతణ్ని విచారణ జరపగా మీ వ్యవహారం బయటపడిందని నమ్మబలికాడు. భార్యను చంపుతానంటూ మీరు మాట్లాడిన ఆడియో క్లిప్‌లు తన వద్ద ఉన్నాయని, ఈ విషయం బయటకు రాకూడదంటే తనకు రూ.75 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో కంగారుపడిన బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. తానంత ఇచ్చుకోలేనని, 20 మాత్రం ఇవ్వగలనంటూ వారిని ట్రాప్ చేశారు. అప్పటికే పోలీసులు సాధారణ దుస్తుల్లో ఉండి మాటువేశారు. నాయర్‌ కారులో ఆలయం వద్దకు వచ్చి డాక్టర్‌తో మాట్లాడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అతణ్ని పట్టుకున్నారు. అయితే ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి మహేష్‌ గౌడ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.


Also Read: Vijayashanthi: ఒవైసీ గారూ.. వెళ్లి తాలిబన్లతో చర్చలు జరిపి రండి.. విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్


Also Read: Hyderabad Theft: అమ్మమ్మతో కలిసి యువకుడు దొంగతనాలు.. వీళ్లు ఆడే నాటకాలకి షాక్‌లో బాధితులు