Naina Jaiswal : ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కు ఆన్ లైన్ లో వేధింపులు తప్పలేదు. ఓ పోకిరి ఇన్ స్టా గ్రామ్ లో నైనా జైస్వాల్ కు అసభ్యకర మెసేజ్ లు పంపి వేధిస్తున్నాడు. ఈ పోకిరిల చేష్టలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. వేధింపుల మెసేజ్ లను స్క్రీన్ షార్ట్స్ తీసి పోలీసులకు అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అంతర్జాతీయ క్రీడాకారిణిగా నైనా జైస్వాల్ రాణిస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో జైస్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ కావడంతో అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో వేధింపులు
సోషల్ మీడియాలో వేధింపులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ను ఓ యువకుడు సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేశాడు. శ్రీకాంత్ అనే యువకుడు వేధిస్తున్నాడని నైనా జైస్వాల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. గతంలో కూడా శ్రీకాంత్ వేధించాడని నైనా జైస్వాల్ తెలిపారు. అప్పట్లో శ్రీకాంత్ కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా తీరుమారని శ్రీకాంత్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టి నైనా జైస్వాల్‌ను వేధిస్తున్నాడు. దీంతో నైనా తండ్రి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాంత్ కోసం దర్యాప్తు చేపట్టారు. అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన నైనా జైస్వాల్ దేశంలో ప్రముఖ టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారుల్లో ఒకరు. నైనా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పలు టైటిళ్లు గెలుచుకుంది.
Also Read : Raksha Bhandhan 2022 : అక్కకు అపురూపమైన గిఫ్ట్, రూ.ఐదు కాయిన్స్ తో తులాభారం
Also Read : Rakhi Festival 2022: రాఖీ పౌర్ణమి రోజున బిడ్డ పుడితేనే రక్షాబంధన్ పండుగ- నేటికీ వేడుక చేసుకోని గ్రామం
Also Read : Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!