Hyderabad Road Accident: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నార్సింగ్ సీబీఐటీ కళాశాల వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. అయితే కారులో ఇరుక్కుపోయి కేకలు వేస్తున్న క్షతగాత్రులను బయటకు తీసే ప్రయత్నం చేశారు స్థానికులు. వెంటనే వారందరినీ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆలోపే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా... క్షతగాత్రులను కూడా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. అయితే మృతులు ముగ్గురు నిజాంపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.    


సిమెంట్‌ లారీ ఢీ కొని నలుగురు మృతి 


మూడు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్ కూడలి వద్ద.. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. వారి వివరాలు మాత్రం తెలియరాలేదు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


తూర్పు గోదావరిలో ముగ్గురు మృతి, మరొకరికి గాయాలు








నిన్నటికి నిన్న దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం



ఆదివారం రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వైఎస్‌ఆర్‌ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కొందరు, కర్ణాటకలోని బళ్లారికి చెందిన మరికొందరు మొత్తం 14 మంది తిరుమలేశుడి దర్శనానికి వెళ్లారు. దర్శనం చేసి తుఫాన్ వాహనంలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కడప తాడిపత్రి ప్రధాన రహదారిలో కొండాపూర్‌ మండలం ఏటూరు గ్రామానికి సమీపంలో ప్రమాం జరిగింది. బాధితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని  లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ఏడుగురు చనిపోయారు. గాయపడ్డ ఐదుగుర్ని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే ఆదివారం రోజు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనంతరం తిరిగి తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా 24వ మలుపు వద్ద అదుపు తప్పిన తుఫాన్ వాహనం ఆంజనేయ స్వామి వారిని మొక్కుతున్న మెదక్ కు చెందిన పార్వతమ్మను ఢీ కొని, ప్రక్కనే ఉన్న పిట్ట గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన స్ధలంలోనే పార్వతమ్మ మృతి చెందగా, తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా రాయదుర్గానికి చెందిన రేణుకమ్మ మృతి చేందింది. మరో ఐదుగురు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


Also Read: హన్మకొండ జిల్లా కాజీపేటలో దారుణం-వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి


Also Read: స్నేహితుడి కిరాతకం, రూ. 80 లక్షల అప్పు కోసం ప్రకాశం జిల్లాలో మహిళ దారుణ హత్య!