Crime News Cheating : జనాల ఆశే మోసగాళ్లకు పెట్టుబడి. ఆ ఆశను పట్టుకుని ఎంత కావాలంటే దోచుకుంటున్నారు. ఆశపడిన వాళ్లు వస్తాయన్నది రాకపోగా ఉన్నది పోగొట్టుకుంటున్నారు. తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఓ ముఠా జనాల్ని ముంచేసింది. ఏకంగా మూడు కోట్లు కొట్టేసింది. ఈ ముఠాను పోలీసులుపట్టుకున్నారు.
ఈ ముఠా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ముందుగా కొన్ని ఫోన్ నెంబర్లకు లాటరీ తగిలిందన్న మెసెజ్ పంపుతారు. చాలా మంది నమ్మరు. కానీ కొంత మంది మాత్రం ఆశపడతారు. తాము అదృష్టవంతులమని.. లాటరీ తగిలిందని అనుకుంటారు. అలాంటి వారు ఆ మెసెజ్‌లో ఉన్న నెంబర్లుకు ఫోన్ చేయడం లేదా వారు చెప్పిన యాప్‌లో వివరాలు నమోదు చేయడం చేస్తూంటారు. అక్కడే బుక్కయిపోతూంటారు. ఇలా ఈ ముఠా కౌన్ బనేగా కరోడ్ పతి కాంటెస్ట్ పేరుతో ఖైరతాబాద్‌కు చెందిన ఓ మహిళకు లాటరీ గెలిచారని సందేశం పంపాడు.
సోషల్ మీడియాలో కనిపించే "సమస్యలు పరిష్కరించే బాబా"ను సంప్రదించాడు - 38 లక్షలు పోగొట్టుకున్నాడు !
అ మహిళ నిజమేనని నమ్మింది. మోసగాళ్లకు ఫోన్ చేసింది. అయితే వారు ఆమె ఆశని గుర్తించి... ఆ చార్జీలు ఈ చార్జీలు అంటూ వసూలు చేయడం ప్రారంభఇంచార.ు నగదు విత్ డ్రా కోసం పలు రకాల ఛార్జీలు కట్టాలని ఆమెకు తెలిపాడు. రూ. కోటి వస్తాయి కదా అని.. ఆమె తన దగ్గర ఉన్నదంతా ఊడ్చి పెట్టడమే కాదు.. అప్పులుకూడా చేసి వారు అడిగినప్పుడల్లా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. మొత్తం రూ. 39 లక్షలు చెల్లించింది బాధితురాలు. ఇక లాటరీ డబ్బులు పంపమని అడిగినప్పుడు సమాధానం దాట వేయడంతో తాను మోసపోయానని గ్రహించి, బాధితురాలు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
"సరళ వాస్తు" చంద్రశేఖర్ గురూజీ హత్య - కర్ణాటకలో దారుణం !
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, నిందితుడు రాకేశ్‌ను బీహార్‌లో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 16 సెల్‌ఫోన్లు, 73 డెబిట్ కార్డులు, 30 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా రాకేశ్ రూ. 3 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.పలువురి వద్ద రూ. కోట్లలో వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నపాట్నా వాసి రాకేశ్‌ను బీహార్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నిందితులపై కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి లాటరీలను నమ్మవద్దని పోలీసులు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కలిగిస్తున్నా మోసాలు మాత్రం ఆగడం లేదు.