Loving Couple Arrested Who Cheated Unemployees in Visakha: విశాఖలో ఓ ప్రేమజంట నిరుద్యోగులను నిలువునా ముంచారు. తాము పోలీసులమని చెప్పి పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు 30 నుంచి 50 మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. విశాఖకు చెందిన హనుమంత రమేష్, అతని ప్రియురాలు ఖాకీ దుస్తులు ధరించి నకిలీ పోలీస్ అవతారం ఎత్తారు. తాము పోలీసులమని.. ఆ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు నమ్మబలికారు. వీరి మాటలు నమ్మిన చాలా మంది వారికి భారీగా డబ్బు ముట్టజెప్పారు. మొత్తం రూ.3 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పెందుర్తి పీఎస్ లో కేసు నమోదు చేసి విచారించారు. నిందితుల కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టగా.. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని పట్టుకున్నారు.


Also Read: Kakinada : బోట్లకు నిప్పంటించి మరీ మత్స్యకారుల నిరసన - కాకినాడలో ఉద్రిక్తత