Hyderabad Viral Video: హైదరాబాద్ లో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతోంది. జగిత్యా జిల్లా మెట్ పల్లి ప్రాంతానికి చెందిన హీరో షోరూమ్ యజమాని నరేష్ హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే బలవన్మరణానికి ముందు నరేష్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో, ఎవరి వల్ల చేసుకోవాల్సి వచ్చిందో సెల్ఫీ వీడియోలో వివరించారు. ప్రతాప్ అనే వ్యక్తి చేతిలో మోసపోయానంటూ నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 


అసలేం జరిగిందంటే?


జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో నరేష్ బైక్ షోరూం నిర్వహిస్తున్నాడు. అయితే ఇందులో వివిధ స్కీముల ద్వారా వాహనాలను విక్రయిస్తుండేవాడు. ఈమధ్య కాలంలో నరేష్ ఆరు స్కీంలను ప్రారంభంచారు. అయితే మొదటి రెండు స్కీంలు దిగ్విజయంగా పూర్తి చేశాడు. మరో నాలుగు స్కీంలు మిగిలి ఉండగా... వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. ఇదే సమయంలో వ్యాపార నిమిత్తం వివిధ ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం ఉండడంతో తన వద్ద నమ్మకంగా పని చేస్తున్న ప్రతాప్ అనే వ్యక్తిని స్కీంలకు ఇన్ ఛార్జీలుగా నియమించారు. ప్రతాప్ పేరుపై హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతాను కూడా తెరిపించాడు. అప్పటి నుంచి లాలవాదేవీలన్నీ కూడా ప్రతాప్ పేరు మీద జరుగుతున్నాయి. ఈ నాలుగు స్కీంల కింద సుమారు 350 వాహనాలను విక్రయించారు. అయితే ఇందులో వాహనాలకు సంబంధించిన నగదును ఇవ్వడంలో ప్రతాప్ మోసం చేసినట్లు తెలుస్తోంది.


నమ్మకంగా పనిలో పెట్టుకున్న ప్రతాప్ తనను మోసం చేయడంతో నరేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అలాగే వివిధ స్కీంల ద్వారా ప్రజల వద్ద నుంచి దాదాపు కోటి 90 లక్షలను తీసుకున్నారు. డబ్బులు ఇచ్చిన వారి నుంచి నరేష్ కు ఒత్తిడి పెరిగింది. స్కీంలో డబ్బులు కట్టిన బాధితులను ప్రతాప్ మోసం చేశాడని నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతాప్ చేతిలో మోసపోయి, ఆర్థికంగా చితికిపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ వెల్లడించాడు. స్కీం డబ్బుల విషయంలో నరేష్ ను వేధిస్తున్నారని. ప్రతాప్ వల్లే నరేష్ ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో తాము ఎలా బతకాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


గత నెలలో విశాఖకు చెందిన దంపతుల సూసైడ్ సెల్ఫీ వీడియో


విశాఖపట్నంలో దంపతులకు చెందిన ఓ సెల్ఫీ వీడియో సంచలనం అయింది. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వారు రోదిస్తూ సెల్ఫీ వీడియోలో చెప్పి బంధువులకు పంపారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా గుర్తించారు. తిరుమల నగర్‌లో ఉంటున్న 47 ఏళ్ల చిత్రాడ వరప్రసాద్.. విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్ఎంఎస్-2 విభాగంలో పని చేస్తున్నాడు. ఇతనికి 41 ఏళ్ల భార్య మీరా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుమారుడు కృష్ణసాయితేజ, కుమార్తె దివ్యలక్ష్మి ఉండగా... కుమార్తెకు గతేడాది వివాహం జరిగింది. ఇవీటలే ఆమెకు ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే కుమారుడు కృష్ణ సాయి తేజ బ్యాటరీ దుకారణం నిర్వహిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యలు ఎక్కువై తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వాపోయారు. 


ఆ సెల్ఫీ వీడియో బయటికి రావడంతో వారి కుమారుడు కృష్ణ సాయితేజ దువ్వాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ దంపతుల కోసం వెతగ్గా.. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ దగ్గర చెప్పులు, హ్యాండ్ బ్యాగు, ఓ సెల్ ఫోనును గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు నిన్నటి నుంచి అక్కడే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మూడ్రోజుల తర్వాత మృతదేహాలు లభ్యం అయ్యాయి.