బట్టల వ్యాపారం కోసం భారత్‌ వచ్చాడు... ఈజీ మనీ కోసం సైబర్‌ నేరగాళ్లతో చేరాడు... మోసాలు అలవాటు చేసుకున్నాడు... రకరకాలుగా అమాయకుల సొమ్మును  దోచుకున్నాడు. పెళ్లి పేరుతో ఓ యువతిని కూడా మోసం చేశారు. చివరకు పోలీసులకు పట్టుబడి ఊచలు లెక్కిస్తున్నారు. పోలీసులు ఊరుకుంటారా... చేసిన మోసాలన్నీ  కక్కించారు. అతనితోపాటు అతని ముఠా.. పట్టబోతున్నారు.


నైజీరియాలోని లాగోస్‌కు చెందిన అలెక్స్ మార్క్ ఓడుడు. ఇతని వయస్సు 44ఏళ్లు. బట్టల వ్యాపారం చేసేందుకు 20 ఏళ్ల క్రితం భారత్‌ వచ్చి ముంబైలో స్థిరపడ్డాడు. తరచూ  ముంబై, నైజీరియాకు రాకపోకలు సాగిస్తుంటారు. సైబరా నేరాలకు పాల్పడుతున్న అతని స్నేహితులను చూసి అట్రాక్ట్‌ అయ్యాడు. వారితో కలిసి సైబర్ నేరాలకు పాల్పడ్డారు.  ఆయుర్వేదిక్ ఆయిల్ పేరుతో ఎంతో మందిని మోసం చేశాడు. ఆ కేసులో మహారాష్ట్ర పోలీసులు 2022లో అలెక్స్‌ను అరెస్టు చేశారు. 7 నెలలపాటు జైలు శిక్ష అనుభించినా..  తీరు మార్చుకోలేదు. 2023 జైల్‌లో జైలు నుంచి విడుదలై మళ్లీ ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడ్డాడు. 


పెళ్లి పేరుతో యువతులను మోసం చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్‌ చేశాడు అలెక్స్‌. మ్యాట్రిమోనీలో తన పేరు ఆదిల్‌జవేష్‌ అని, యూఎస్‌లోని హాస్టన్‌లో ఉంటున్నట్టు  రిజిస్ట్రర్‌ చేసుకున్నారు. హైదరాబాద్‌ యువతితో పరిచయం పెంచుకున్నాడు. తాను ఎన్‌ఆర్‌ఐ అని, కార్డియో థొరాసిక్‌ సర్జన్‌గా బ్రుక్‌ ఆర్మి మెడికల్‌ కాలేజిలో పనిచేస్తున్నట్లు  ఆమెను నమ్మించారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అతని మాటల వలలో పడిపోయిన యువతి... అంతా నిజమే అని నమ్మింది. ఒకరోజు.. తాను  సిరియాకు డ్యూటీ మీద వెళ్తున్నానని.. తర్వాత వస్తానని యువతికి కల్లబొల్లి కబుర్లు చెప్పాడు నైజీరియన్‌ అలెక్స్‌. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి సిరాయలో ఉగ్రదాడి  జరుగుతోందని... తాను అక్కడే ఇరుక్కుపోయానని చెప్పాడు. తన అకౌంట్‌ కూడా ఫ్రీజ్‌ చేశాడని చెప్పాడు. ఇండియాకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.  అతని మాటలు నమ్మిన ఆ యువతి విడతల వారీగా.... 27లక్షల 43వేలు పంపింది. 


ఆ తర్వాత... గత నెల 7వ తేదీ సికింద్రాబాద్‌లోని ఘాంస్‌ మండిలోని యువతి ఇంటికి వచ్చిన నిందితుడు నకిలీ కరెన్సీ బండిల్స్‌తో కూడిన డిజిటల్‌ లాకర్‌ ఆమెకు ఇచ్చాడు.  అవి నకిలీ నోట్లని తెలుసుకున్న యువతి... మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేశారు.  తప్పించుకుని తిరుగుతున్న నైజీరీయన్‌ అలెక్స్‌ను అరెస్ట్‌ చేశారు. అతని నుంచి 5 సెల్‌ఫోన్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అతనితోపాటు సైబర్‌ నేరాలకు  పాల్పడుతున అతని స్నేహితుల గ్యాంగ్‌ గుట్టు కూడా రాబట్టారు. వివిధ రాష్ర్టాల్లో పాల్పడిన మొత్తం 12 కేసులను పోలీసులు ఛేదించారు.