హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. వాట్సప్వేదకగా ఖరీదైన హోటళ్లలో విదేశీ యువతులతో అసాంఘిక కార్యకాలపాలు గుట్టుగా సాగుతోంది. ఇటీవల గచ్చిబౌలిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ముగ్గురు విదేశీ యువతులు, ఒడిశాకు చెందిన మణికేష్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుగొలపే అంశాలు తెలిశాయి. కజకిస్థాన్, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్థాన్ నుంచి యువతులను భారత్ కు విజిటింగ్ వీసాపై తీసుకొచ్చి, గడువు ముగిసే వరకు కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ నగరాలకు వ్యభిచారం చేయిస్తున్నారు.
Also Read: Ravi Teja: ఈడీ విచారణకు హాజరైన హీరో రవితేజ.. బ్యాంక్ లావాదేవీలపై ఆరా
నకిలీ ఆధార్ కార్డులు తయారీ
కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు తయారు చేస్తున్నట్లు పోలీసులు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. వీసా గడువు ముగిసినా తర్వాత ఆధార్ కార్డు, ఓటర్ ఐడీతో దేశంలో చలామణీ అవుతున్నారు. ఈ కేసులో నిందుతుడి ఫోన్ లో వ్యభిచారానికి సంబంధించిన లావాదేవీలు పోలీసులు విచారణలో వెలుగుచూశాయి. నగరానికి చెందిన పలువురు ప్రముఖుల ఫోన్ నెంబర్లు, వాట్సాప్ సంభాషణలు చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ భారీ వ్యవస్థను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read: భార్యతో బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదు.. ముంబై ఫ్యామిలీ కోర్టు తీర్పు
Also Read: Nabha natesh Photos: అదిరే అందంతో ఫిదా చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్
ప్రముఖుల పేర్లు
వివిధ నగరాల్లోని ఫైవ్ స్టార్ హోటళ్లలలో ఒకట్రెండు రోజులు యువతులను ఉంచి వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తుంటారు. అమ్మాయిలను ఎప్పుడు తీసుకొచ్చేది ప్రధాన నిర్వాహకుడికి మాత్రమే తెలుస్తోంది. ఈ రాకెట్ లో సంపన్నులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారే అధికులు ఉన్నారు. విదేశీ యువతులకున్న డిమాండ్ దృష్ట్యా భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.