హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. బృందావన్ కాలనీలో స్థానికులను చితకబాదారు ఈ గ్యాంగ్ సభ్యులు. రావుల భాస్కర్‌, రావుల విక్రాంత్, రాజు, విశాల్‌పై విచక్షణరహితంగా దాడి చేశారు. 


మైలార్‌దేవ్‌పల్లిలోని బృందావన్ కాలనీలో కొందరు యువకులు గంజాయి తాగుతున్నారు. ఈ క్రమంలోనే వారిని అడ్డుకోవడానికి వెళ్లినవారిపై దాడి చేశారు. స్థానికులతో గంజాయి బ్యాచ్‌కు జరుగుతున్న గొడవను ఆపడానికి వెళ్ళిన రావుల భాస్కర్‌పై దాడి చేశారు గంజాయి తాగుతున్న యువకులు. గొడవ జరుగుతున్న టైంలోనే ఆ బ్యాచ్‌లోని ఓ వ్యక్తి ఫోన్ చేసి తన అనుచరులను 50 మందిని రప్పించాడు. వారి రాకతో వివాదం మరింత ముదిరింది. వచ్చిన వాళ్లు కర్రలతో రాళ్లతో స్థానికులపై విచక్షణ రహితంగా దాడి చేసి  పరారయ్యారు. 


భాస్కర్‌రావుతోపాటు విక్రాంత్ మెడపై కత్తితో దాడి చేశారు యువకులు. స్థానికులు అతి కష్టమ్మీద ఒకరిద్దర్ని స్థానికులు పట్టుకున్నారు. ప్రతిఘటించి తప్పించుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు , గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు.