Four Young People Drowned In Bapatla District: బాపట్ల (Bapatla) జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. సముద్రంలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో స్నానానికి వెళ్లిన నలుగురు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మెరైన్ సిబ్బంది నాలుగో వ్యక్తి మృతదేహం కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. గల్లంతైన నలుగురు యువకులు ఏలూరు జిల్లాకు దుగ్గిరాలకు చెందిన వారే. బీచ్‌కు వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 


మహిళ దారుణ హత్య


మరోవైపు, బాపట్ల జిల్లాలోనే దారుణం జరిగింది. చీరాల మండలం ఈపురుపాలెంలో ఓ యువతిని దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు వెతుకులాడగా.. రైల్వే ట్రాక్ సమీపంలో ముళ్ల చెట్లలో యువతి మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అటు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని హోంమంత్రిని ఆదేశించారు.


Also Read: Bapatla News: బాపట్ల జిల్లాలో యువతి హత్యాచారం - ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, హోంమంత్రికి కీలక ఆదేశాలు