Varun Sandesh About Mohan Babu: టాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘నింద’. ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో డీసెంట్ టాక్ తో రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న వరుణ్.. సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన గురించి బయట జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.


మోహన్ బాబు చాలా ఫన్నీ పర్సన్- వరుణ్ సందేశ్


మోహన్ బాబు చాలా ఫన్నీగా ఉంటారని వరుణ్ సందేశ్ చెప్పారు. “మోహన్ బాబు గారు చాలా ఇన్ స్పైరింగ్ పర్సన్. బయట ఆయన గురించి చాలా అనుకుంటారు. ఇలా ఉంటారు, అలా ఉంటారనే ప్రచారం ఉంది. అవన్నీ అవాస్తవం. ఆయన చాలా స్వీట్ పర్సన్. ఆయనతో పరిచయం ఉంటే చాలు.. చాలా సరదాగా ఉంటారు. నా వరకు అయితే.. ఆయన చాలా ఫన్. ఆయనతో కలిసి సినిమా చేశాను. ఆయనకు కొడుకుగా చేశాను. చాలా గుడ్ ఎక్స్ పీరియెన్స్ ఉంది. మోహన్ బాబుపై ఉండే రెస్పెక్ట్ తో ‘మామ మంచు అల్లుడు కంచు’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలో సపోర్టింగ్ రోల్స్ లో నటించాను. మంచు ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. ‘భక్త కన్నప్ప’ సినిమా కోసం నన్ను అడగలేదు” అని చెప్పుకొచ్చారు.


హ్యూమన్ రైట్స కమిషన్ అధికారిగా వరుణ్ సందేశ్


‘నింద’ సినిమాలో వరుణ్ సందేశ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు చెందిన అధికారిగా వరుణ్ సందేశ్ కనిపించారు. కాండ్రకోట అనే ఊళ్లో మంజు అనే అమ్మాయి అత్యాచారం, హత్యకు గురవుతుది. ఆమెను చంపేసింది బాలరాజు( ఛత్రపతి శేఖర్) అని పోలీసులు అరెస్టు చేస్తారు. కోర్టు అతడికి ఉరి శిక్ష వేస్తుంది. ఈ తీర్పు ఇచ్చిన న్యాయవాది సత్యానంద్(తనికెళ్ల భరణి) ఎంతో ఇది సరైన తీర్పు కాదనుకుంటారు. అదే బాధలో చనిపోతారు. ఈ కేసులో అసలు నిందితులు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాడు న్యాయమూర్తి కొడుకు వివేక్(వరుణ్ సందేశ్). ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని కిడ్నాప్ చేస్తాడు. వారి నుంచి నిజం తెలుసుకుంటాడా? బాలరాజును ఉరిశిక్ష నుంచి కాపాడుతాడా? అనేది ఈ సినిమాలో చూపించారు. 


‘నింద’ సినిమాను రాజేష్ జగన్నాథం తెరకెక్కించారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయనే నిర్మించారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనికెళ్ళ భరణి, 'ఛత్రపతి' శేఖర్, శ్రేయా రాణి రెడ్డి, యాని, భద్రమ్ సహా పలువురు ఈ చిత్రంలో నటించారు. సంతు ఓంకార్ సంగీతం అందించారు.  


అటు ‘కానిస్టేబుల్’ అనే సినిమాలోనూ వరుణ్ సందేశ్ నటిస్తున్నారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మధులిక హీరోయిన్ గా నటిస్తోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది.



Read Also: కల్కి మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ - ఇందులో కాశీ నగరం ప్రత్యేకం, ఎందుకంటే..