Darshan Remuneration: ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు విషయం కేవలం శాండిల్‌వుడ్‌లో మాత్రమే కాదు.. మొత్తం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కన్నడ సినిమాలు ఎక్కువగా ఫాలో అవ్వని వాళ్లకు దర్శన్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అందుకే అసలు ఈ హీరో ఎవరు, తను చేసిన సినిమాలు ఏంటి అని మిగతా భాషా ప్రేక్షకులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం తన సినిమాల గురించి, వాటికి తను తీసుకునే రెమ్యునరేషన్ గురించి చర్చలు మొదలయ్యాయి. అసలు దర్శన్.. ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో మీరూ చూసేయండి.


ఛాలెంజింగ్ స్టార్‌..


1997లో ఎస్ నారాయణ తెరకెక్కించిన ‘మహాభారత’ సినిమాలో ఒక చిన్న రోల్‌లో మెరిశాడు దర్శన్. వెండితెరపై కనిపించడం అదే తనకు మొదటిసారి. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో ఛాలెంజ్‌లను ఎదుర్కుంటూ ఛాలెంజింగ్ స్టార్‌గా మారాడు. కన్నడ సినీ పరిశ్రమలో యశ్, సుదీప్ లాంటి హీరోలు రాకముందు ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే హీరోగా దర్శన్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సీనియర్ హీరో, పైగా కమర్షియల్‌గా సక్సెస్‌లు సాధించిన నటుడు కాబట్టి తన రెమ్యునరేషన్ కూడా ఒక రేంజ్‌లో ఉంటుందని ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు.


రెమ్యునరేషన్ లేకుండా..


కన్నడ మీడియాలో దర్శన్ రెమ్యునరేషన్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. తను ఒక్క సినిమాకు దాదాపుగా రూ.22 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ముందుగా తను సైన్ చేసే ప్రతీ సినిమాకు రూ.3 కోట్లను అడ్వాన్స్‌గా తీసుకొని మిగతా పారితోషికాన్ని సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో తీసుకుంటాడట దర్శన్. అయితే తను నటించిన మొదటి సినిమాకు అసలు రెమ్యునరేషనే తీసుకోలేదట ఈ సీనియర్ హీరో. ఆ తర్వాత తను హీరోగా వచ్చిన 10 సినిమాల వరకు కూడా తన రెమ్యునరేషన్ కేవలం రూ.1 లక్ష మాత్రమే. ఈ విషయాన్ని దర్శన్ స్వయంగా పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టాడు. తనకంటే కొత్తగా వచ్చిన హీరోలకే రెమ్యునరేషన్ ఎక్కువ అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు.


ఎన్నో కాంట్రవర్సీలు..


దర్శన్ హీరోగా ‘రాబర్ట్’ అనే సినిమాలో నటించాడు. దానికి ఉమాపతి నిర్మాతగా వ్యవహరించారు. అయితే వీరిద్దరి మధ్య రెమ్యునరేషన్ విషయంలో అప్పట్లో పెద్ద గొడవే జరిగింది. ముందుగా ఈ మూవీ కోసం దర్శన్‌కు రూ.25 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని ఒప్పుకున్నారట. కానీ సినిమా పూర్తయిన తర్వాత పునీత్ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ వద్ద తాను కొనుగోలు చేసిన ప్రాపర్టీని దర్శన్.. తన పేరు మీద రాయాలని బెదిరించినట్టు ఉమాపతి ఆరోపణలు చేశాడు. అయితే ఉమాపతి.. తనకు కొంత డబ్బును ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ ప్రాపర్టీని తనకు అమ్మేయమని సూచించానని దర్శన్ అన్నాడు ఇది మాత్రమే కాదు.. దర్శన్ కెరీర్‌లో ఇలాంటి ఎన్నో కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. కానీ రేణుకా స్వామి మర్డర్ కేసు మాత్రం ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది.


Also Read: కిరాణా షాప్‌ to హీరోయిన్‌ స్థాయికి - భర్తను వదిలి దర్శన్‌తో ప్రేమ.. పవిత్ర గౌడ గురించి రాస్తే ఒక పుస్తకం అవుతాది!