Severe Accident In Tirupati: తిరుపతి జిల్లాలో (Tirupati District) గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరి (Chandragiri) మండలం భాకరాపేట కనుమ రహదారిలో ఓ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కలకడ నుంచి చెన్నైకి టమాటా లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి కారు, బైక్‌ను ఢీకొట్టింది. కంటైనర్ కారుపై పడిపోగా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారులోని యువకుడు కంటైనర్ కింద చిక్కుకోగా.. తనను కాపాడాలంటూ వేడుకున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి.

Continues below advertisement


Also Read: Crime News: ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య