Rajamouli Mahesh Babu Movie New Working Title: ‘RRR’ సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి... టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఓ రేంజ్లో బజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రాజమౌళి.


‘SSMB 29’.. ‘SSRMB’గా మార్పు


ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు ‘SSMB29’గా పిలుస్తూ వస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కడంతో ఈ పేరు వాడుతున్నారు. అయితే, ఇప్పుడు వర్కింగ్ టైటిల్ కాస్త మార్పులు చేశారు రాజమౌళి. ‘SSMB 29’ని ‘SSRMB’గా ఛేంజ్ చేశారు. అంటే, ఎస్ ఎస్ రాజమౌళి, మహేష్ బాబు పేర్లు కలిపి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరోతో పాటు దర్శకుడికి సమాన క్రెడిట్ వచ్చేలా మార్పులు చేశారు.  


మహేష్ అభిమానులు హర్ట్


రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయంతో మహేష్ బాబు అభిమానులు హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో తమ బాధను వెల్లడిస్తున్నారు. ‘SSMB 29’ ఉంటేనే బాగుటుందంటున్నారు. మరోవైపు ఈ సినిమా వర్కింగ్ టైటిల్ రాజమౌళి సూచించినట్లుగా ఉంటేనే బాగుంటుందని మరికొంత మంది వాదిస్తున్నారు. మహేష్ సినిమాను రాజమౌళి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారే తప్ప, మహేష్ బాబు కారణంగా రాజమౌళి గ్లోబల్ స్థాయికి వెళ్లడం లేదని గుర్తుంచుకోవాలంటున్నారు. హీరోతో పాటు దర్శకుడికి సమాన క్రెడిట్ ఇవ్వడం మంచిదంటున్నారు.    


వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం


ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది చివర్లోనే ప్రారంభం అవుతుందని అందరూ భావించినా, వచ్చే ఏడాది మొదలుకాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున సెట్స్ వేస్తున్నారు. అక్కడే వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికాగా, నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు మహేష్ బాబు కూడా ఈ సినిమాకు తగినట్లుగా మేకోవర్ అవుతున్నారు. కొత్తలుక్ లోకి మారే ప్రయత్నం చేస్తున్నారు.


గ్లోబల్  అడ్వెంచర్ థ్రిల్లర్ గా..


ఈ సినిమా గ్లోబల్  అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందనుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ సంస్థ ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.  


Read Also: ఇన్ఫినిటీ ప్రైజ్ మనీ కోసం బొక్క బోర్లా పడ్డ సోనియా... నిఖిల్, పృథ్వీ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్, మనీ కోసం కుస్తీ



Also Read: ఆర్జీవీ 'దిశా ఎన్కౌంటర్' హీరోయిన్, కరీంనగర్ రైతు బిడ్డ... 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్ సోనియా ఆకుల బ్యాగ్రౌండ్ తెలుసా?