Fire Accident In Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో (Visakha Steel Plant) మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. SMS - 1లో మంటలు చెలరేగి.. సీనియర్ మేనేజర్‌ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి సిబ్బంది ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎల్‌పీబే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్లాంట్‌లోని యంత్రాలు, ఉత్పత్తికి ఎలాంటి నష్టం జరగలేదని.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్లాంట్‌లో కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భారీగా ఉక్కు ఉత్పత్తి అయ్యే కంపెనీలో ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.


Also Read: Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్