Fake SBI branch dupes villagers Bold 10 day scam uncovered in Chhattisgarh : ఉత్తుత్తి బ్యాంకుల్ని పెట్టి మోసం చేసేవాళ్లను చూసి ఉంటాం కానీ.. నేరుగా ఎస్‌బీఐ బ్యాంకునే పెట్టిన మోసం చేసే వాళ్లను మాత్రం అరుదుగా చూస్తాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవారు ఆ రకానికి చెందినవారే. సేమ్ ఎస్‌బీఐ బ్రాంచ్ ను పెట్టేశారు. కానీ దొరికిపోయారు.


చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్ పూర్‌కు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఓ చప్రీ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో హఠాత్తుగా ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటూ బోర్డు పెట్టేసి అచ్చం బ్యాంకులాగానే లోపల సెటప్ వేశారు. డిపాజిట్ల కోసం.. పాంప్లెట్లు వేశారు. ఉద్యోగులు కూడా బయట నుంచి వచ్చారు. కొత్త అకౌంట్లు తెరవాలని కూడా ప్రచారం చేసుకున్నారు. అంతా కరెక్ట్‌గా జరిగిపోతుందనుకున్నారు కానీ.. ప్రపంచం మరీ అంత అమాయకంగా లేదని వెంటనే తెలుసుకున్నారు.     


గుడి ముందు సెల్ఫీ దిగారంటే చోరీకి స్కెచ్ వేసినట్టే- గూగుల్‌లో ఫేమస్ టెంపుల్సే వాళ్ల టార్గెట్‌


సమీపంలోని ఓ నిజమైన ఎస్‌బీఐ బ్రాంచ్‌కు ఆ గ్రామం నుంచి వెళ్లిన వ్యక్తి ఇక తన అకౌంట్ తమ గ్రామానికి మార్చాలని కోరాడు. ఆ మాట విన్న బ్యాంకులోని వ్యక్తులు ఆశ్చర్యపోయారు. ఆ గ్రామంలో బ్రాంచ్ ఎప్పుడు  పెట్టారు.. తమకు తెలియకుండా బ్రాంచులు పెడతారా అని ఆరా తీశారు. బ్యాంక్ మేనేజర్ చప్రీ గ్రామానికి ఏమీ తెలియనట్లుగా వెళ్లి పరిశీలన జరిపి..అది ఫేక్ అని గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి.. ఎస్‌బీఐలోని నకిలీ ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ పోలీసులకు కూడా షాక్ తగిలింది అదేమిటంటే.. అందులో ఉన్న ఉద్యోగులు కూడా తాము నిజంగానే ఎస్‌బీఐ ఉద్యోగులం అనుకుంటున్నారు.                               


తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు                         


ఎస్‌బీఐ బ్రాంచ్ ను నకిలీది పెట్టిన మోసగాళ్లు..అందులో ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారు. ఐదు లక్షలు ఇస్తే బ్యాంకు ఉద్యోగం ఇస్తామని చెప్పారని చివరికి రెండున్నర లక్షలకు బేరం కుదిరిందని ఆ మొత్తం ఇచ్చి ఉద్యోగంలో చేరానని ఫేక్  బ్యాంకు  బ్రాంచ్ లో ఉన్న పేక్ ఉద్యోగి వాపోయారు. పోలీసులుకేసు నమోదు చేసుకుని అసలు సూత్రధారులు ఎవరా అన్నది ఆరా తీశారు. ముగ్గురు కరుడుగట్టిన పాత నేరస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు.    


మరమూల పల్లెలలు టార్గెట్ చేసుకుని మోసగాళ్లు ఇలాంటి పనులు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సలహాలిస్తన్నారు.