Bride Suicide in Eluru District: పెళ్లి ఇంకొద్ది గంటల్లో ఉందనగా వధువు అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో పచ్చని పందిరిలో విషాదం అలుముకుంది. ఆ యువతి తాను ఒకరిని ప్రేమించగా, మరో వ్యక్తితో పెళ్లి అవుతూ ఉందనే మనస్తాపంతో ఈ అఘాయిత్యం చేసుకుందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జాజులకుంటకు చెందిన 24 ఏళ్ల యువతి డిగ్రీ చదవి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ అమ్మాయి కొద్ది రోజులుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. ఈలోపు కుటుంబ సభ్యులు జంగారెడ్డి గూడెం లక్కవరానికి చెందిన మరో వ్యక్తితో పెళ్లి కుదిర్చారు. ఈ బుధవారమే పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, తనకు పెళ్లి ఇష్టం లేదని, తాను మరో వ్యక్తిని ప్రేమించానని యువతి గతంలోనే తల్లిదండ్రులకు చెప్పింది. కానీ తల్లిదండ్రులు బలవంతంగా యువతిని పెళ్లికి ఒప్పించారు. దీంతో ఆ పెళ్లి ఇష్టం లేని యువతి తాజాగా ఆత్మహత్య చేసుకుంది. 


మంగళవారం (జూన్ 7) రాత్రి గదిలోకి వెళ్లి చీర మార్చుకుంటానని చెప్పిన యువతి ఎంతకీ బయటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా యువతి అప్పటికే చనిపోయి ఉంది. ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడించారు.


కొద్ది వారాల క్రితంతో విశాఖపట్నంలోని మధురవాడలోనూ.. ఇలాంటి ఘటన జరిగిన సంగతి తెలిసిందే. వధువు పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయి చనిపోయింది. విశాఖ మ‌ధుర‌వాడ‌కు చెందిన సృజ‌న వివాహం శివాజీ అనే యువ‌కుడితో నిశ్చయ‌మైంది. సాయంత్రం 7 గంట‌ల‌కు ముహూర్తం. ముహూర్తం స‌మ‌యం వ‌ర‌కూ సృజ‌న ఉత్సాహంగానే క‌నిపించింది. అయితే, రెండు రోజుల కింద‌టే సృజ‌న అనారోగ్యంగా ఉండ‌టంతో కుటుంబీకులు వైద్యుల‌కు చూపించారు.


వైద్యం పూర్తైన త‌ర్వాతే కుటుంబీకులు పెళ్లి పీట‌ల మీదికి తెచ్చారు. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. స‌రిగ్గా ముహూర్త స‌మ‌యానికి వ‌ధువు, వ‌రుడు పెళ్లి పీట‌ల పైకి వ‌చ్చారు. జీల‌క‌ర్ర బెల్లం పెట్టే స‌మ‌యంలో సృజ‌న ఒక్క సారిగా వేదిక‌పైనే కుప్పకూలింది. దీంతో కుటుంబీకులు తీవ్ర ఆందోళ‌న చెందారు. వెంట‌నే ఆస్పత్రికి త‌ర‌లించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.


Also Read: Nizamabad Rape: పక్కింటి బాలికపై యువకుడు అఘాయిత్యం, ఇన్‌స్టాలో పరిచయమై మరొకడు కూడా