Khanjawala Case:
నిందితులు చెప్పింది ఇదీ..
ఢిల్లీలోని కంజావాల్ కేసులో కీలక ఆధారం లభించింది. యువతిని నాలుగు కిలోమీటర్ల పాటు కారు లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్‌ను పోలీసులు విడుదల చేశారు. అన్ని కిలోమీటర్ల మేర లాక్కెళ్లడం వల్ల యువతి దుస్తులు కార్‌లో చిక్కుకుని పూర్తిగా చినిగిపోయాయని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. కొంత దూరం వెళ్లాక యువతి మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లారు నిందితులు. అప్పటికే ఆమె ఒంటిపై దుస్తులన్నీ చిరిగిపోయాయి. యువతిని గుర్తించి SGM హాస్పిటల్‌కు తరలించారు. కానీ...అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. దీనిపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. "కార్ నంబర్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశాం. విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. వాళ్ల కార్‌కు యాక్సిడెంట్ అయింది. స్కూటీని ఢీకొట్టింది. అయితే...కార్‌కు ఆ యువతి చిక్కుకుందని, అన్ని కిలోమీటర్ల పాటు లాక్కెళ్లామని గుర్తించలేదని నిందితులు తెలిపారు" అని ఔటర్ ఢిల్లీ డీజీపీ స్పష్టం చేశారు. "వాళ్లు ఓ చిన్న సందులో వెళ్తున్నట్టు చెప్పారు. అప్పుడే యాక్సిడెంట్ అయింది. అయితే...ఎవరూ గట్టిగా అరవకపోవటం వల్ల ఏమీ కాలేదేమో అనుకుని డ్రైవ్ కంటిన్యూ చేసినట్టు చెప్పారు. కొంత దూరం వెళ్లాక కార్ టైర్‌కు ఏదో చిక్కుకున్నట్టు అనిపించి ఆపారు. అప్పుడే యువతి మృతదేహాన్ని చూశారు. వెంటనే డెడ్‌బాడీని రోడ్‌పై వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు" అని వివరించారు. ప్రస్తుతం నిందితులను మూడు రోజుల రిమాండ్‌కు తరలించారు.
హత్య చేశారు: నిందితురాలి తల్లి..
మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులపై విశ్వాసం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. విచారణ సరైన రీతిలో జరిపిస్తారన్న నమ్మకం లేదని అంటున్నారు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, ఎవరో కావాలనే హత్య చేశారని అనుమానిస్తున్నారు. నిందితులను కాపాడేందుకే పోలీసులు సరిగా విచారించడం లేదని ఆరోపిస్తున్నారు. సుల్తాన్‌పురి లోని కంజావాలా ప్రాంతంలో జరిగిందీ ఘటన. దీనిపై మృతురాలి తల్లి చాలా భావోద్వేగంగా మాట్లాడారు. "రాత్రి 9 గంటలకు నేను తనతో మాట్లాడాను. తెల్లవారు జామున 3-4 గంటల వరకూ వచ్చేస్తాను అని చెప్పింది. పెళ్లిళ్లలో ఈవెంట్ ప్లానర్‌గా పని చేస్తుండేది. ఉదయం పోలీసులు నాకు కాల్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ చాలా సేపు వెయిట్ చేయించారు" అని వివరించారు. ఇది హత్య అని, తన కూతురుని చంపే ముందు ఆ వ్యక్తి లైంగికంగా వేధించాడని ఆరోపిస్తున్నారు మృతురాలి తల్లి. "మా తమ్ముడు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. నా కూతురు చనిపోయిన విషయాన్ని చెప్పాడు. నా కూతురే కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంటి నుంచి నిండు దుస్తులతో వెళ్లిన తన ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. ఇది యాక్సిడెంట్ ఎలా అవుతుంది" అని ప్రశ్నించారు.
Also Read: Bharat Jodo Yatra: హే రామ్ సినిమా అందుకే చేశాను, తమిళం మా గర్వం - రాహుల్‌తో కమల్ హాసన్