Morena Viral Video:  అబ్బాయిల కంటే అమ్మాయిలకే తండ్రి అంటే ఎక్కువ ప్రేమ ఉంటుందని అనుకుంటారు. అయితే మధ్యప్రదేశ్ లోని ఇద్దరు అమ్మాయిలు మాత్రం తమ తండ్రిని చచ్చేదాకా కొట్టారు. తల్లి చూస్తూండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వారి సోదరుడు అడ్డుకుంటున్నా వదిలి పెట్టలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ఈ వీడియోలో ఇద్దరు కూతుళ్లు తమ తండ్రిని కర్రలతో కొట్టడం ఉంది.  వారి తమ్ముడు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, వారు అతనిని తిట్టి, తండ్రిని కొట్టడం కొనసాగించిన దృశ్యాలున్నాయి.ఈ దెబ్బలు భరించలేక అతను చనిపపోయాడు.  పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఇలా కొట్టడానికి కారణాలేమిటన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.    





 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే   కొట్టడం వల్ల చనిపోలేదని పోస్టుమార్టం రిపోర్టు ఉండటంతో పోలీసులు  ఇది హత్య కేసా,  సహజ మరణమా అన్న దానిపై పరిశోధన చేస్తున్నారు. వైరల్ వీడియో ఆధారంగా ప్రజలు తొందరపడి నిర్ధారణలకు రావద్దని పోలీసులు చెబుతున్నారు.  ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని  చెబుతున్నారు.  



చనిపోయిన వ్యక్తి పేరు హరేంద్ర మోర్య. అతనికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఓ కొడుకు కూడా ఉన్నాడు.  మొరెనా సిటీ కొత్వాలి ప్రాంతంలో ఉంటారు. వారి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. అయినా ఇద్దరు కూతుళ్లకు ఇటీవలే పెళ్లి చేశాడు. వాళ్లు అత్తారింటికి వెళ్లే సమయంలో మళ్లీ గొడవలు జరిగాయి. దాంతో  అతడి భార్య హరేంద్ర కాళ్లు గట్టిగా పట్టుకుని కూర్చుని ఉండగా ఇద్దరు కుమార్తెలు కర్రలతో కొట్టారు. ఇతులు ఎవరో వీడియో తీశారు.  గ్వాలియర్ మెడికల్ కాలేజీ వైద్య బృందంతో హరేంద్ర మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించారు. పూర్తి వివరాలను దర్యాప్తు చేసి.. చర్యలు తీసుకుంటామని తెలిపారు.  


మధ్యప్రదేశ్ లో తల్లీకూతుళ్లు ఇలా ఓ వ్యక్తి ప్రాణం తీయడం సంచలనంగా మారింది. కొట్టడం వల్ల చనిపోలేదని .. తర్వతా అతను ఉరి వేసుకుని చనిపోయాడని స్థానిక మీడియా ప్రచారం చేస్తోంది.  అయితే  ఈ అంశంపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.