TwitterX outage: ఎక్స్ ఖాతాలు ఓపెన్ కావడం లేదు. ట్విట్టర్ ఫీడ్ కనిపించడం లేదు. దాదాపుగా ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు న్యూస్ అప్ డేట్స్ వచ్చే ట్విట్టర్ ఫ్లాట్ ఫామ్ ఒక్క సారిగా ఔటేజ్ కావడంతో ఏం జరిగింందో తెలియక సబ్ స్క్రయిబర్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఈ వార్త రాసే సమయానికి ఎక్స్ కానీ.. ఎలాన్ మస్క్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 


ప్రపంచవ్యాప్తగా ఈ సమస్య రావడంతో.. ఎక్స్ టెక్నికల్ టీం అప్రమత్తమయి స్వాల్ చేసినట్లుగా తెలుస్తోంది. కాసేపటి తర్వాత యధావిధిగా పని చేయడం ప్రారంభించింది. ట్విట్టర్ యూజర్లకు తమకు ఎదురైన అనుభవాలను ట్విట్టర్ లోనే వివరించారు.  





గతంలో ట్విట్టర్ బ్లూ టిక్ కు ఎలాంటి డబ్బులు వసూలు చేసేవారు కాదు. కానీ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాలసీ మార్చారు. ధృవీకరణకు డబ్బులు తీసుకుటున్నారు. అది కూడా ఒక నెల కాదు... ప్రతీ నెలా కట్టాలి. అలాగే..  కొన్ని ప్రమాణాలు పెట్టి వాటికి తగ్గట్లుగా పేమెంట్ కూడా చేస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో కొంత మంది కి పేమెంట్ అంతోంది. అందుకే ట్విట్టర్ నుంచి ఆదాయం పొందే వారి సంఖ్యకూడా ఎక్కువగానే ఉంది.  అందుకే ట్విట్టర్ ఔటేజ్ రాగానే గగ్గోలు మొదలయింది. 





కొొంత మంది ఎలాన్ మస్క్ పై సెటైర్లు వేస్తున్నారు.  ఎలాన్ మస్క్ గోర్క్ పేరుతో ఏఐ టూల్ ను కూడా ట్విట్టర్ కేంద్రంగా లాంచ్ చేశారు. అందుకే రెండింటిని కలిపి సెటైర్లు వేస్తున్నారు.