Cyber Cheating In Anantapuram: ఓ రైల్వే ఉద్యోగికి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. బ్యాంకు ఖాతాలో నుంచి ఏకంగా రూ. 72 లక్షలు స్వాహా చేశారు. సైబర్ ఉచ్చులో పడొద్దని ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా వారి మాయలో పడుతున్న వాళ్లు ఉండనే ఉంటున్నారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అనేకమంది పడి లక్షలు పోగొట్టుకుంటున్నారు. వివిధ ఫోన్ నెంబర్ నుంచి కాల్స్ చేసి మీరు పలానా కేసులో ఉన్నారు.. మిమ్మల్ని అరెస్టు చేస్తామని మొదట బెదిరిస్తారు. అనంతరం మీరు కేసు నుంచి బయట పడాలంటే చెప్పిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు అనంతపురం జిల్లా గుత్తి మండలంలో జరిగింది కూడా ఇలాంటి కేస్.
సైబర్ నేరగాళ్లు మాయలో పడిన రైల్వే ఉద్యోగి లక్ష కాదు రెండు లక్షల కాదు ఏకంగా 72 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు భయపెట్టి బాధితులతో వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.
గుత్తి ఆర్ఎస్‌లోని చంద్రప్రియనగర్‌కు చెందిన రైల్వే ఉద్యోగికి 4 రోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. 'మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం ఇటీవల ముంబైలో జరిగిన బాంబు పేలుడులో నువ్వెందుకు ఉన్నావు అంటూ అవతలి వారు రైల్వే ఉద్యోగితో అన్నారు. దీంతో భయపడిన ఆ రైల్వే ఉద్యోగి తాను ముంబైకే వెళ్ల లేదని చెప్పగా సైబర్ నేరగాళ్లు అతని దబాయించారు. 'పేలుడు జరిగిన ప్రాంతంలో నీ ఏటీఎం కార్డు వాడినట్టు ఉంది. మర్యాదగా ఒప్పుకో.. లేకపోతే అరెస్టు చేస్తాం' అంటూ బెదిరించారు. కేసు నుంచి బయట పడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా పంపాలన్నారు.
ఆ రైల్వే ఉద్యోగి మొదట రూ.12 లక్షలు, తర్వాత రూ.60 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు అకౌంట్ నంబర్లకు ట్రాన్స్ఫర్ చేశాడు. రూ.22 లక్షలు ఎఫ్‌డీ ఉండగా వాటిని రద్దు చేసి ఆ డబ్బు సమర్పించుకున్నాడు.
నుంచి ముభావంగా ఉన్న ఆ వ్యక్తిని సహచరులు ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయం అంతా చెప్పారు. ఈ క్రమంలో వారి సూచన మేరకు మంగళవారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ నంబర్లను పోలీసులు పరిశీలించగా ఒకటి జమ్మూకశ్మీర్ నుంచి, మరొకటి కోల్‌కతా నుంచి వచ్చినట్లు తెలిసింది.