Cyber Crimes Matrimonial: ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. టెలీ కాలర్ స్కామ్ లు, ఆన్‌లైన్ స్కాములు, సోషల్ మీడియాలో పరిచయమై డబ్బులు వసూలు చేసే కుంభకోణాల గురించి తరచూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి. చదువుకున్న వాళ్లు కూడా ఈ ఆన్‌లైన్ స్కాముల్లో చిక్కుకుని మోసపోతున్నారు. వందల్లో, వేలల్లో కాదు ఏకంగా లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి కూతురు కావాలంటూ, పెళ్లి కొడుకు కావాలంటూ పోస్టులు పెట్టి.. ఆయా ప్రొఫైళ్లకు ఆకర్షితులైన వారి నుంచి డబ్బులు కాజేస్తున్న మోసాలు కూడా వెలుగుచూస్తున్నాయి. అలాంటి ఓ ఘటన తాజాగా పుణెలో జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నుంచి ఓ మహిళ ఏకంగా రూ. 91 లక్షల రూపాయలు కాజేసింది.
పుణెకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి ఆన్‌లైన్ లో మహిళను కలుసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రముఖ మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ నచ్చి తనను కాంటాక్ట్ అయ్యాడు. ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొన్ని రోజులుగా వీరి మధ్య ఫోన్లలో సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మహిళకు పుణె టెకీకి మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతూ వచ్చింది. అలా మాట్లాడుతూ బ్లెస్‌కోయిన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టాలంటూ ఆ మహిళ పురుషుడితో మాట్లాడి ఒప్పించింది. ఆ మహిళ మాటలు నమ్మిన టెకీ.. పలు బ్యాంకులతో పాటు లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకుని దశల వారీగా రూ. 91.75 లక్షలను మహిళకు అందించి పెట్టుబడి పెట్టాడు. తను పెట్టిన పెట్టుబడి ఎంతకీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన అతడు ఆ మహిళను నిలదీశాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో దేహు రోడ్ లోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిని ఆన్ లైన్ కుంభకోణంగా తేల్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Karnataka News: కూలీకి నిప్పంటించి హత్య చేసిన కిరాణ షాపు యజమాని, విచారణలో దొరకడంతో జైలుశిక్ష
లగ్జరీ కార్లు, విల్లాలు, ఫామ్‌హౌజ్‌లతో ఫోటోలు
ఫుల్ సౌండ్ పార్టీ అని చెప్పాడు. లగ్జరీ కార్ల పక్కన నిలబడి ఫోటోలు తీసుకున్నాడు. విల్లాలు, ఫామ్‌హౌజ్‌లు కూడా ఉన్నాయని బిల్డప్ ఇచ్చాడు. మ్యాట్రిమొనీ సైట్‌లో ఓ అమ్మాయికి ఈ ఫోటోలన్నీ పంపాడు. ఇక పెళ్లి చేసుకోవడమే మిగిలింది అనుకునే టైమ్‌లోని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఆ మహిళను మోసం చేసి అడ్డంగా దొరికిపోయాడు. యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన విశాల్ అనే 26 ఏళ్ల యువకుడు తనను తాను "రిచ్ బ్యాచిలర్" అని ప్రచారం చేసుకున్నాడు. తనకు తగిన జోడీ కోసం వెతుకుతున్నట్టు మాయ మాటలు చెప్పాడు. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేసేందుకు లగ్జరీ కార్‌లలో తిరుగుతున్నట్టు ఫోటోలు, వీడియోలు పంపేవాడు. ఈ కేటుగాడి వలలో పడిన ఓ మహిళ రూ.3 లక్షలు కోల్పోయి చివరకు పోలీసులను ఆశ్రయించింది. చీప్‌గా iPhones ఇస్తానంటూ మూడు లక్షలు తీసుకుని సైలెంట్‌గా ఉండిపోయాడు నిందితుడు. మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాక కానీ...ఈ నాటకం అంతా బయట పడలేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే...ఆ నిందితుడు బాగా చదువుకున్నాడు. పైగా ఓ MNCలో ఉద్యోగం కూడా చేశాడు. సొంతగా వ్యాపారం మొదలు పెట్టాడు. కానీ ఆ వ్యాపారంలో బాగా నష్టాలొచ్చాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఓ ఐడియా వచ్చింది. ఈజీమనీ కోసం ప్రయత్నించాడు. వెంటనే మ్యాట్రిమొనీ సైట్‌లో ఫోటోలు పెట్టి డ్రామా స్టార్ట్ చేశాడు. పోలీసుల అరెస్ట్‌తో ఈ నాటకానికి తెర పడింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial