Case Filed Against Pawan Kalyan Fans : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లపై సవరింపు జీవోను తీసుకొచ్చింది. గరిష్టంగా రూ.150, రూ.250 వరకు సినిమా టికెట్లు పెంచుకునేలా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో ఏసీ, నాన్ ఏసీ థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లను సవరిస్తూ జీవో వచ్చిన రోజే పవన్ కళ్యాణ్ అభిమానులకు పోలీసులు షాకిచ్చారు. చిత్తూరు జిల్లా పీలేరులో పవన్ కళ్యాణ్ అభిమానులపై కేసు నమోదైంది.
పవన్ కళ్యాణ్ అభిమానులపై కేసు నమోదు..
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం గత నెలలో విడుదలైంది. భీమ్లా నాయక్ రిలీజ్ రోజున ఓ మేకను జంతుబలి ఇచ్చారు. పీలేరు సిఎస్.ఎన్ థియేటర్‌లో గొర్రెపిల్లను బలి ఇచ్చారని జంతు ప్రేమికుడు, న్యాయవాది అసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జంతుబలికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాద్యమాలలో వైరల్ అయినట్టు ఫిర్యాదులో అసద్ పేర్కొన్నారు. ఏపీలో సినిమా టికెట్ల వివాదం సద్దుమణిగింది అనుకున్న రోజే, కొన్ని రోజుల కిందట ఇచ్చిన జంతు బలి వివాదం తెరమీదకు రావడం పవన్ ఫ్యాన్స్‌ను ఇరుకున పెడుతోంది.
చిక్కుల్లో థియేటర్ యాజమాన్యం..
న్యాయవాది అసర్ మహరాష్ట్ర నుంచి ట్విటర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రూయల్టీ, బర్డ్స్ ఆర్మ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సీఎస్ఎన్ థియేటర్ వద్ద జంతు బలి జరిగిందని థియేటజర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు పవన్ అభిమానులను గుర్తించే పనిలో పడ్డారు. పవన్ కళ్యాణ్ అభిమానులను గుర్తించేందుకు వైరల్ అయిన వీడియోలను పరిశీలిస్తున్నారు.
లాయర్ ఫిర్యాదు..
సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'భీమ్లానాయక్'. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందించిన ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది కానీ 'ఆర్ఆర్ఆర్' కోసం వాయిదా పడింది. ఆపై కొత్త రిలీజ్ డేట్ ప్రకారం ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడులైంది. మూవీ రిలీజ్ రోజు పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఓ జంతువును బలి ఇచ్చారు. కానీ ఇన్ని రోజుల తరువాత జంతుబలికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, దీనిపై జంతు ప్రేమికుడు, లాయర్ మహారాష్ట్ర నుంచి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: Prabhas Thanks To YS Jagan: జగన్‌కు ‘డార్లింగ్’ థ్యాంక్స్ - టికెట్ రేట్ల జీవోపై స్పందించిన ప్రభాస్!