CSK Captain MS Dhoni Practice Session Watch Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League 2022) సీజన్ 15 మార్చి 26న ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబైలోని వాంఖేడె వేదికగా తలపడతాయి. ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో సీఎస్కే, కేకేఆర్ జట్లు ప్రాక్టీస్ షురూ చేశాయి.
గత రెండు సీజన్లుగా తీవ్రంగా నిరాశపరుస్తున్న ఎంఎస్ ధోనీ తన ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు పంపుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న సీఎస్కే కెప్టెన్ ధోనీ మునుపటిలా బ్యాట్ ఝులిపిస్తున్నాడు. ఒంటి చేత్తో ధోనీ భారీ షాట్లు ఆడుతూ సిక్సర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోనీ ఈజ్ బ్యాక్ అంటూ సీఎస్కే ఫ్యాన్స్, మహీ అభిమానులు ఐపీఎల్ కొత్త సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అదరగొడుతున్న ధోనీ..
గత కొన్ని సీజన్లుగా సాధారణంగా ఆడుతున్న ధోనీ ఈ సీజన్‌లోనూ సీఎస్కేకు ట్రోఫీ అందించాలని పట్టుదలగా ఉన్నాడు. ముంబై, పుణే వేదికగా మ్యాచ్‌లు నిర్వహిస్తారు కనుక, సరిగ్గా అలాంటి పిచ్ ఉన్న సూరత్ లోని లాలా భాయ్ కాంట్రాక్ట్ స్టేడియంలో ధోనీ సారథ్యంలో సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. నెట్ సెషన్లో పాల్గొన్న కెప్టెన్ ధోనీ భారీ షాట్లు ఆడుతున్న వీడియోలు సీఎస్కే ఫ్యాన్స్‌లో జోష్ తీసుకొచ్చాయి. గతంలో మాదిరగా ఒంటి చేత్తో ధోనీ భారీ షాట్లు ఆడుతున్న వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో లైక్స్, కామెంట్లతో చెలరేగిపోతున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ 4 స్టేడియాల్లోనే జరుగుతాయి. ముంబైలోని వాంఖేడె స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికలుగా ఐపీఎల్ 2022 నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది.
ఐపీఎల్ 2022లో సీఎస్కే లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ (CSK's full schedule in IPL 2022):
- CSK vs KKR, మార్చి 26 - రాత్రి 7.30 గంటలకు, వాంఖేడె స్టేడియం
- CSK vs LSG, మార్చి 31 - రాత్రి 7.30 గంటలకు, బ్రబౌర్న్
- CSK vs PBKS, ఏప్రిల్ 3 - రాత్రి 7.30 గంటలకు, బ్రబౌర్న్
- CSK vs SRH, ఏప్రిల్ 9 - మధ్యాహ్నం 3.30 గంటలకు, డీవై పాటిల్ స్టేడియం
- CSK vs RCB, ఏప్రిల్ 12 - రాత్రి 7.30 గంటలకు, డీవై పాటిల్ స్టేడియం
- CSK vs Gujarat ఏప్రిల్ 17 - రాత్రి 7.30 గంటలకు, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణే
- CSK vs MI, ఏప్రిల్ 21- రాత్రి 7.30 గంటలకు, డీవై పాటిల్ స్టేడియం
- CSK vs PBKS, ఏప్రిల్ 25 - రాత్రి 7.30 గంటలకు, వాంఖేడె స్టేడియం
- CSK vs SRH, మే 1 - రాత్రి 7.30 గంటలకు, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణే
- CSK vs RCB, మే 4 - రాత్రి 7.30 గంటలకు, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణే
- CSK vs DC, మే 8 - రాత్రి 7.30 గంటలకు, డీవై పాటిల్ స్టేడియం
- CSK vs MI, మే 12 - రాత్రి 7.30 గంటలకు, వాంఖేడె స్టేడియం
- CSK vs GT, మే 15 - మధ్యాహ్నం 3.30 గంటలకు, వాంఖేడె స్టేడియం
- CSK vs RR, మే 20 - రాత్రి 7.30 గంటలకు, బ్రబౌర్న్
Also Read: IPL 2022 Promo: ఐపీఎల్ 2022 కొత్త ప్రోమో వచ్చేసింది, మ్యాచ్ చూసేందుకు ధోనీ ఏం చేశాడో చూశారా !
Also Read: IPL 2022 Full Schedule: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది - సన్‌రైజర్స్ మొదటి మ్యాచ్ వారితోనే?