Chittoor News: పట్టపగలు, నడిరోడ్డుపై పోలీసు స్టేషన్ బయట ఉన్న పోలీసు జీపును ఎత్తుకెళ్లిపోయాడో వ్యక్తి. తాళం వేయకుండా ఉన్న బండిని అంతా చూస్తుండగానే.. దర్జాగా తీసుకెళ్లిపోయాడు. 


అసలేం జరిగిందంటే?


చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్ రక్షక జీపును ఓ వ్యక్తి మాయం చేశాడు. సోమవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో పోలీసు స్టేషన్ కు ఎదురుగా పార్కు చేసి ఉన్న వాహనం మాయమైనట్లు పోలీసు గుర్తించారు. దీంతో అప్రమత్తంమైన వన్ టౌన్ పోలీసులు సీసీ పుటేజ్ ను పరిశీలించగా.. రక్షకభట వాహనాన్ని ఎటు వైపు తీసుకెళ్లారో గుర్తించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరుకి చెందిన వందవాసి అనే మతిస్థిమితం లేని వ్యక్తి జీపును దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వందవాసిను అదుపులోకి తీసుకుని అతని వద్ద జీపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.