Bihar Father Rape : తండ్రి రూప మృగం ! బీహార్‌లో కామపిశాచి తండ్రి నికృష్టాన్ని బయట పెట్టిన కుమార్తె

ఆ తండ్రి కూతుర్ని చెరబట్టాడు. తల్లిసమర్థించింది. మేనమాన నోరు తెరవొద్దన్నాడు. కానీ ఆ కూతురు వీడియో తీసి తన తండ్రి నికృష్ణాన్ని ప్రపంచం ముందు పెట్టింది.

Continues below advertisement

 

Continues below advertisement

కన్నతండ్రి నుంచి కూడా రక్షణ లేకపోతే ఇక ఆడపిల్లలు ఎలా బతుకుతారు ? బీహార్లో బయటపడిన ఈ ఘటన అందుకే సంచలనం రేపుతోంది. బీహార్‌లోని సమస్తిపూర్ పోలీస్ స్టేషన్‌కు ఓ పద్దెనిమిదేళ్ల యువతి వచ్చింది. తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి తాను చిత్రీకించిన వీడియోను పోలీసులకు ఇచ్చింది. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.  ఆమెపై ఎవరు అఘాయిత్యానికి పాల్పడ్డాడో చేప్పేసరికి  పోలీసులకు కూడా  ఇదేం పైశాచికత్వం అనిపించింది. ఇంతకు ఆ పద్దెనిమిదేళ్ల యువతిపై అత్యాచారం చేసిందెవరంటే.. తండ్రే. 

మహిళా పోలీస్ న్యూడ్ ఫోటోల్ని ఆమె తల్లిదండ్రులకే పంపాడు - అడ్డంగా బుక్కయ్యాడు !

బీహార్‌లో సమస్తిపూర్‌కు చెందిన యాభై ఏళ్ల వ్యక్తి టీచర్‌గా పని చేస్తూంటాడు. అతను పద్దెనిమిదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఆ విషయాన్ని ఆ యువతి తన తల్లికి చెబితే ఎలాంటి  రియాక్షన్ ఇవ్వలేదు. పైగా తండ్రే కదా అన్నట్లుగా మాట్లాడింది.దీంతో ఈ విషయాన్ని తన మేనమామ దృష్టికి తీసుకెళ్లింది. తండ్రి దారుణానికి పాల్పడుతున్నాడని చెప్పింది. ఆయన కూడా కుటుంబ గౌరవం కోసం బయట మాట్లాడవద్దని కట్టడి చేశాడు. చివరికి ఆ యువతి తన తండ్రి తనపైచేస్తున్న ఘోరాన్ని బయట ప్రపంచానికి తెలియచేయాలని అనుకుంది. సీక్రెట్‌గా కెమెరా పెట్టింది. తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు చిత్రీకరించింది. ఆ వీడియోను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

వెలుగులోకి ఎస్ఐ విజయ్ కుమార్ ఆగడాలు, వివాదాల మధ్యే వివాహం

అయితే  పోలీసులు మొదట ఈ కేసును సీరియస్‌గా తీసుకోలేదు. పట్టించుకోలేదు. కానీ ఆ యువతి తీసిన వీడియో ఎలా లీకయిందో కానీ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయింది. దీంతో ఆ తండ్రి గురించి .. ఆ తండ్రి పైశాచికిత్వం గురించి అందరికీ తెలిసిపోయింది. చివరికి పోలీసులు చర్యలు తీసుకోక తప్పలేదు. తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇప్పుడీ అంశంపై బీహార్‌లో కలకలం రేపుతోంది. 

36 ఏళ్ల మహిళపై పోక్సో కేసు - ఎంత ఘోరానికి పాల్పడిందంటే ?

బాలికలు, మహిళలకు కుటుంబంలోనే లైంగిక వేధింపులు అనేవి పెద్ద సమస్యగా మారాయి.  బీహార్‌లో ఇలాంటి నేరాల శాతం అధికంగా ఉంది. ప్రతీ ఏటా పతిశాతం కేసులు పెరుగుతూ ఉన్నాయి. నిజానికి కుటుంబంలో జరుగుతున్న ఆకృత్యాలు బయటకురావడం లేదు. అతి తక్కువ బయటకువస్తున్నాయి. అవి కూడా భారీగా పెరుగుతున్నాయి.  సమాజంలో తరిగిపోతున్న మానవ సంబంధాల అంశాన్ని ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయంటున్నారు.

 

Continues below advertisement
Sponsored Links by Taboola