Bengaluru Woman Murderd Mother : వివాహేతర బంధాలు తెలిసిపోతాయన్న కంగారులో వాటిలో పాలు పంచుకునేవాళ్లు అంత కంటే ఘోరమైన తప్పులు చేసేందుకు వెనుకాడరు. కన్న బిడ్డల్ని చంపిన ఘటనల్ని విన్నాం.. అలా కన్న  తల్లిదండ్రులు చంపిన ఘటనలు కూడా తరచూ వెలుగు చూస్తున్నాయి. బెంగళూరులో ఇలాంటి ఘటనలో ఒకటి బయటపడింది.


చంపేసి బాత్ రూంలో  జారి పడిపోయిందని  పోలీసులకు చెప్పిన కుమార్తె 


బెంగళూరుకు చెందిన జయలక్ష్మి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. విచారణ జరిపిన పోలీసులకు ఆమె  కుమార్తె పవిత్ర సురేష్ ..తన తల్లి బాత్ రూంలో జారి పడిందని చెప్పింది. అపస్మారక స్థితిలో ఉండగా చూసి ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పింది. పోలీసులు కూడా అదే రాసుకున్నారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఊపిరి ఆడకుండా చేయడం వల్ల చనిపోయిందని రిపోర్టు వచ్చింది. దీంతో పోలీసులు మెల్లగా తవ్వడం ప్రారంభించారు. చివరికి  అన్ని వేళ్లూ పవిత్ర సురేష్ వైపే చూపించాయి. 


అధిక వడ్డీ ఆశ చూపి రూ.700 కోట్లు కొట్టేశారు- .. హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన కంపెనీ


ప్రియుడితో ఏకాంతంలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకన్న తల్లి హత్య 


పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో చివరికి నేరం ఒప్పుకుంది. తన బాయ్ ఫ్రెండ్ కలిసి తన తల్లిని చంపేశానని ఒప్పుకుంది. దీనికి కారణం పవిత్రా సురేష్ తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడుపుతున్న  సమయంలో ఆమె తల్లి విజయలక్ష్మి రెడ్ హ్యాండె డ్ గా పట్టుకోవడమే. పవిత్రా సురేష్ కు గతంలోనే పెళ్లి చేసింది ఆమె తల్లి. అయితే దారి తప్పిన పవిత్రా సురేష్.. తన కంటే పదేళ్లు చిన్న వాడైన యువకుడితో వివాహేత బంధం పెట్టుకుంది.  


పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా దారి తప్పిన పవిత్రా సురేష్ - తల్లిని చంపి జైలుకు 


పవిత్రా సురేష్ కు పదకొండేళ్ల కిందటే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన తల్లి ఇంట్లోనే ఓ కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ దుకాణంంలో ఆమె  తల్లితో కూడా పని చేయించుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడూ తల్లిని దుకాణంలో ఉంచి.. వేరే దారి ద్వారా ప్రియుడ్ని లోపలికి పిలిపించుకునేది. ఇలా చేస్తున్న సమయంలో ఓ సారి తల్లి చూసింది. ఈ వ్యవహారం పయట పడటంతో.. మొత్తం అందరికీ తెలిసిపోతుందని.. తన తల్లి ఇంటికి రానివ్వదన్న భయంతో ఇద్దరూ కలిసి ఆమెను చంపేసి.. బాత్ రూంలో పడి చనిపోయిందని నాటకం ఆడారు.                             


Also Read: కదులుతున్న ట్రైన్‌లో బాలికపై రైల్వే ఉద్యోగి దారుణం! చావగొట్టిన ప్రయాణికులు


పోలీసులు వారి స్టోరీ ని చూసి..నివ్వెర పోయారు. ఇద్దర్నీ అరెస్టు చేసి జైలుకు పంపారు.    ఈ వ్యవహారం కర్ణాటకలో కలకలం రేపింది.