Bapatla Job Fraud: బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్తూ.. పలువురు నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసింది. తనకు తెలిసిన వారందరికీ మాయ మాటలు చెప్తూ.. డబ్బులు వసూలు చేసి, మరో చోటుకు మకాం మార్చేది. ఇలా ఐదు జిల్లాల్లో చాలా మంది యువతని మోసం చేసింది. చివరకు బాధితుల ఫిర్యాదుతో సమాచారం ప్రసార శాథ సిబ్బంది రంగంలోకి దిగి కిలేడీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


బిడ్డిక నిర్మల అనే మహిళపై ఇప్పటికే ఐదు జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయని బాపట్ల పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చిత్తూరు జిల్లాలోనూ నిర్మల కొలువులు ఇప్పిస్తానని చెప్పి.. నిరుద్యోగ యువత నుంచి లక్షల్లో వసూలు చేసి మోసం చేసింది. బాధితుల ఫిర్యాదుతో చిత్తూరు సీపీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత జూన్ లో గుంటూరు కేంద్రంలో నిర్మల అక్రమాలకు తెరతీసింది. కార్లలో తిరుగుతూ కలెక్టరేట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఐదుగురి నుంచి  5 లక్షల రూపాయల మేర నగదు వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయిన బాధితులు గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 


గతంలో ఉద్యోగాలిప్పాస్తానంటూ మోసం చేసిన మహిళ హత్య...


గుంటూరు జిల్లా  మేడికోండూరు మండలం పేరేచర్ల కెనాల్ వద్ద హత్య 2016లో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో గుర్తు తెలియని మృతదేహం అని కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు  ప్రారంభించారు. చిన్న చిన్నగా దొరికిన ఆధారాలను పట్టుకుని ముందుగా అసలు ఆమె ఎవరో గుర్తించారు. అయితే ఈ కేసులో నిందితులని ఈ ఏడాది పట్టుకున్నారు. 


చనిపోయిన మహిళ పేరు ఆకుల భవాని, ఉమ్మడి ఏపీ హైకోర్టులో బెంచ్ గుమస్తాగా పని చేసేది. అయితే ఆమె ఉద్యోగాల పేరుతో యువకుల్ని మోసం చేస్తోందని కేసులు నమోదు కావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఆ తర్వాత కూడా  అదే పని కొనసాగించింది. ఈక్రమంలో కేసర శ్రీనివాసరెడ్డి, నీరుకోండ హేమకుమార్, నీరుకోండ పార్వతీ అనే వాళ్ల  దగ్గర కూడా డబ్బులు వసూలు చేసింది. ఉద్యోగాలిప్పిస్తానని చాలా కాలం తిప్పించుకుంది. చివరికి తాము మోసపోయామని గుర్తించిన వారు తమ డబ్బులు ఇవ్వాలని కోరారు. కానీ ఆకుల  భవానీ ఇవ్వలేదు. 


అడిగి అడిగి వేసారిపోయినకేసర శ్రీనివాసరెడ్డి, నీరుకోండ హేమకుమార్, నీరుకోండ పార్వతీలు ఆకుల భవానీని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే నమ్మకంగా పిలిచి ఆమెను చంపేశారు. ఎవరికీ కనిపించకుండా కెనాల్ దగ్గర పడేసి వెళ్లిపోయారు. ఆరేళ్ల వరకూ వారు దర్జాగానే తప్పించుకుని తిరిగారు. కానీ ఆమె ఎవరో గుర్తు పట్టడంతో.. ఆమె వ్యవహారాలన్నీ బయటకు లాగడంతో హంతకులుకూడా దొరికారు. ఆకుల భవానికి డబ్బులు కట్టి అటు ఉద్యోగాలు రాకపోగా.. ఇటు హత్య కేసులో జైలు పాలయ్యారు..ఈ ఆశావహులు.