Delhi businessman hangs self - divorce business dispute with wife: కలిసి ఉండటం సాధ్యం కాదని తన వాటా తనకు ఇచ్చేయాలని విడిపోదామని వేధిస్తున్న భార్యల కారణం కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల బెంగళూరులో అతుల్ సుభాష్ అనే వ్యక్తి ఇలా తన పరిస్థితుల్ని వివరించి తనకు చనిపోవడం తప్ప మరో మార్గం లేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ అయింది.
తాజాగా ఢిల్లీలో నివసించే పునీత్ ఖురానా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి అతని భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరూ విడిగా ఉంటున్నారు. పునీత్ ఢిల్లీలో ఓ బేకరీ చైన్ నిర్వహిస్తూ ఉంటారు. అందులో తనకు వాటా రాసివ్వాలని ఆమె డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులోనూ దీనిపై వాదనుల జరుగుతున్నాయి. ఫోన్ లో వారిద్దరి మధ్య ఈ అంశంపై వాగ్వాదం జరగడంతో కాసేపటికే పునీత్ ఖురానా ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసులు అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వివరాలు పరిశీలించిన తర్వాత అతని భార్యను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. పునీత్ ఖురానా ఢిల్లీలోని కల్యాణ్ విహార్ ప్రాంతంలో నివాసం ఉంటారు. ఆయనకు కొన్నాళ్ల కిందట వివాహం అయింది. పెళ్లి తర్వాత అతుల్ ఖురానా తన వ్యాపారంలో భార్యను భాగస్వామిగా చేర్చుకుని నిర్వహణ బాధ్యతలు కూడా ఇచ్చారు. అయితే ఇద్దరి మధ్య సరి పడకపోవడంతో విడిపోవాలని అనుకున్నారు. కానీ వ్యాపారం నుంచి తనను తొలగించడానికి లేదని తన వాటా తనకు రాసివ్వాల్సిందేనని ఆమె పట్టుబడుతున్నారు. ఇలా ఇవ్వడం ఇష్టం లేని పునీత్ ప్రాణాలు తీసుకున్నాడు.
వివాహ వేధింపులు, విడాకులు చట్టాలు, మనోవర్తి ఇలా అన్నీ ఆడవాళ్లకు అనుకూలంగా ఉండటంతో మగవాళ్లు నలిగిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వరకట్న కేసులు పెట్టగానే భర్తను.. వారి కుటుంబాన్ని కూడా జైలుకు పంపుతున్నారు. ఇలాంటి వాటికి బాధితులైన మగవారు.. న్యాయపరంగా తేల్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.దీనిపై దేశంలో ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది.