AP Govt orders high-level probe into Mumbai actress Kadambari Jeethwani cases :  ముంబైకి చెందిన డాక్టర్, నటి కాదంబరి జెత్వానీ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. మీడియా చానళ్లతో మాట్లాడుతూ ఏపీ ఐపీఎస్ అధికారులు తనను అత్యంత ఘోరంగా వేధించారని తనతో పాటు తన తల్లిదండ్రుల్ని కూడా వేధించారని.. 40 రోజుల పాటు నిర్బంధించి ఖాళీ పత్రాలపై సంతకం పెట్టించుకుని వదిలి పెట్టారని ఆరోపించారు. ఈ అంశం సంచలనంగా మారడంతో ఏపీ ప్రభుత్వం  దృష్టి సారించింది. సీఎంవోకు ఇంటలిజెన్స్ అధికారులు, విజయవాడ సీపీ  రాజశేఖర్ బాబు నివేదికలు సమర్పించారు. ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించారు. 


ముంబై నటి తన భద్రత, తన కుటుంబ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా ఆమె వద్ద నుంచి ఆన్ లైన్ లో పిర్యాదు తీసుకుని దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.. ఆ కేసులో ఆ నటి కుటుంబాన్ని అరెస్టు చేయడానికి ముంబైకి వెళ్లిన బృందం మొత్తాన్ని ఓ సారి పిలిపించి మాట్లాడారు.  అప్పటి  కమిషనర్ కాంతిరాణా టాటా, డీసీపీగా ఉన్న విశాల్ గున్ని మినహా ఇతరుల్ని ప్రశ్నించి అసలు జత్వానీ కుటుంబాన్ని తీసుకు వచ్చింది.. ఎక్కడ ఉంచారు.. ఎలా వేధించారన్న వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. 


వైసీపీకి బిగ్ షాక్ - ఏకకాలంలో రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా


కృష్ణాజిల్లా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తమను రూ. ఐదు  లక్షలకు కాదంబరి జెత్వానీ మోసం చేసిందని  పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి.. విమానాల్లో ముంబైకి వెళ్లి ఆ కుటుంబాన్ని పోలీసులు తీసుకు వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఇలా వేరే రాష్ట్రాలకు వెళ్లి ఓ సినీ నటిని చీటింగ్ కేసులో అరెస్టు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు. అయితే కాదంబరి జెత్వానీ కటుంబాన్ని తీసుకు వచ్చి నలబై రోజులు విజయవాడలో ఉంచినా సరే మీడియాకు సమాచారం ఇవ్వలేదు. పూర్తిగా అంతర్గతంగా ఉంచారు. అదే సమయంలో బెయిల్ కూడా పోలీసులు ఇప్పించి ముంబైకి పంపినట్లుగా తెలుస్తోంది. అప్పటికే సెటిల్మెంట్ పై సంతకాలు పెట్టించుకున్నారని అంటున్నారు. 


Kadambari Jethwani Interview | AP Police, YSRCP నేతలు ఎలా హింస పెట్టారంటే |


కాదంబరి జత్వానీని వేధిచిన ఘటనలో..  ప్రధానంగా  ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు,  కాంతిరాణా టాటాతో పాటు విశాల్ గున్నీ పేర్లు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వీరు చట్టాలను పట్టించుకోకుండా వైసీపీ రాజకీయ శత్రువుల్ని  వేధించడానికే పరిమితయ్యారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా వీరికి  పోస్టింగ్  కూడా దక్కలేదు. రోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినా ఆ పని  కూడా చేయడం లేదు. ఇప్పుడు ఈ కేసులో అసలేం  జరిగిందో ఉన్నత స్థాయి దర్యాప్తులో తేలనుంది. ఐపీఎస్ అధికారులు తప్పు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.