Madya pradesh Police Atrack: మధ్యప్రదేశ్‌లో రైల్వే పోలీసులు అతిదారుణంగా ప్రవర్తించారు. 15ఏళ్ల దళిత బాలుడు, అతని నానమ్మను తీవ్రంగా కొట్టారు. గదిలో నిర్బంధించి... ఇద్దరినీ కర్రతో చితకబాదింది మహిళా పోలీస్ ఆఫీసర్. వృద్ధురాలు అని కూడా చూడకుండా... మహిళ పట్ల ఇష్టారీతిగా వ్యవహరించింది. ఆమె జట్టు పట్టుకుని ఈడ్చి ఈడ్చి కొట్టింది. అంతేకాదు.. కాలితో తన్ని పైశాచిక ఆనందం పొందింది. బాలుడిని కూడా కర్రతో బాదేసింది. ఆ తర్వాత.. కొట్టి కొట్టి ఆమె అలిసి పోయిందో ఏమో... నలుగురు మగ పోలీసులు లోపలికి వచ్చారు. వారంతా 15 ఏళ్ల బాలుడిని పట్టుకుని... అరికాళ్లపై లాఠీతో చాలా సార్లు కొట్టారు. బాలుడని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక.. వారు అరుస్తున్నా... పట్టించుకోలేదు. 2023 అక్టోబర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో... ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో.. ఆ పోలీసులు తీరు వివాదాస్పదమైంది. ప్రభుత్వంపై... ప్రతిపక్షాల విరుచుకుపడటంతో... విచారణ చేపట్టారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఇంతకీ... ఆ బాలుడిని... ఆ ముసలావిడను.. పోలీసులు ఎందుకు అంత దారుణంగా కొట్టారో తెలుసా..
అసలు ఏం జరిగిందంటే...
మధ్యప్రదేశ్ జబల్‌పూర్ (Jabalpur) లోని కట్ని రైల్వే పోలీస్ స్టేషన్ (Katni Govenment Railway Police Station) లో సీఐ అరుణ వగనే(CI Aruna Vagane).. ఈమె.. దళిత మహిళ కుసుమ్ వాన్‌స్కర్ (Kusum Wanskar), ఆమె మనవడు, 15ఏళ్ల బాలుడు దీపరాజ్ (Deeparaj)ను చితకబాదింది. అసలు ఏం జరిగిందంటే... సీఐ అరుణ వగనే చెప్పినదాని ప్రకారం... కుసుమ్ వంస్కర్ కుమారుడు, దీపరాజ్ తండ్రి... దీపక్ వాన్‌స్కర్(Deepak Wanskar) రైళ్లలో దొంగతనాలు చేస్తున్నాడు. అతనిపై 19 కేసులు ఉన్నాయి. అతన్ని పట్టుకుంటే 10వేల రూపాయలు రివార్డ్ ఇస్తామని.. పోలీసులు ప్రకటించారు. అయినా... దీపక్ పోలీసులకు చిక్కలేదు. అతని కుటుంబసభ్యులంతా... దీపక్‌కు మద్దతు ఇస్తున్నారు. అందుకే... దీపక్ తల్లి, కుమారుడిని తీసుకొచ్చి విచారణ చేశామని.. వారు ఇచ్చిన సమాచారంతో దీపక్‌ను అరెస్ట్ చేయగలిగామని సీఐ అరుణ అంటున్నారు.
పోలీసుల తీరుపై రాజకీయ రగడ..
2023 అక్టోబర్ జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో... రాజకీయ దుమారం రేగింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని(Madya pradesh Government) టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దళితులపై ప్రభుత్వం, పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తోంది. ఈ ఘటన దళితుల అణచివేతకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ (Madhya Pradesh Congress President Jitu Patwari)... పోలీసులు కొడుతున్న వీడియోను షేర్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని... రాష్ట్రంలో దళితుల అణిచివేత ఆగాలంటూ పోస్టు పెట్టారు. పోలీసుల దాడి... భయంకరమైన సంఘటనగా పేర్కొన్నారు జితు పట్వారీ. బీజేపీ దుష్పరిపాలనలో మధ్యప్రదేశ్‌లోని దళితులు భయంకరమైన జీవితాన్ని గడపాల్సి వస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను రక్షించలేకపోతే... ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(CM Mohan Yadav).. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ (Madhya Pradesh Youth Congress) కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చూస్తూ... విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, గూండాయిజం పెరిగిపోయిందని... ప్రజలను చంపుతారని ఘాటుగా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
పోలీసులపై చర్యలు చేపట్టిన ప్రభుత్వం...
దళిత మహిళ, అతని మనవడిని కొట్టిన కేసులో... జబల్‌పూర్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్, స్టేషన్ ఇంఛార్జ్ అరుణను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు... ఉన్నతాధికారులతో దర్యాప్తునకు ఆదేశించింది. దీపక్ వాన్‌స్కర్‌పై రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు అంటున్నారు. 2017 నుంచి అతని కోసం గాలిస్తున్నట్టు స్థానిక పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కొట్టారంటూ తమకు ఫిర్యాదు రాలేదని.. బాధితుల నుంచి కంప్లెయింట్ వస్తే దర్యాప్తు చేస్తామని అంటున్నారు.