Sri Sathyasai District Crime News : చిలమత్తూరు: పండుగ రోజు శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కుటుంబసభ్యులను కత్తులతో బెదిరించి అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. మండలం నల్లబొమ్మినిపల్లి గ్రామంలో వాచ్ మెన్, కొడుకును కత్తులతో బెదిరించి ఆయన భార్య, కొడుకు భార్యపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఎస్పీ వెల్లడించారు.


నల్లబొమ్మినిపల్లి గ్రామంలో ఓ కంపెనీలో వాచ్ మెన్‌గా చేస్తున్న వ్యక్తి తన ఫ్యామిలీతో రోడ్డు పక్కన ఇంట్లో నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ఓ వ్యక్తిగా అటుగా వస్తున్నట్లు గమనించిన వాచ్ మెన్ లైట్ వేసి చూసి, ఎవరు అని అడిగాడు. అంతలోనే ఆ వ్యక్తి వాచ్ మెన్ పై దాడి చేశాడు. మరికొందరు వ్యక్తులు వచ్చి అతడి కొడుకుపై కూడా దాడి చేశారు. వారిని చంపేస్తామంటూ కత్తులతో బెదిరించి ఇంట్లో ఉన్న అత్తాకోడలుపై సామూహిక అత్యాచారం చేశాడని ఎస్పీ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


పండుగ పూట ఇలాంటి ఘటనలు బాధాకరమన్న బాలకృష్ణ
అమరావతి: చిలమత్తూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై జిల్లా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. పండగ వేళ మహిళలపై ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఎస్పీ రత్నాతో ఫోన్లో మాట్లాడిన బాలకష్ణ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు తాను, తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.


అత్యంత బాధాకరమైన సంఘటన 
పవిత్రమైన దసరా పండుగ రోజున ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరగడం అత్యంత ఘోరమైన ఘటన అని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. పోలీసులు ఆ నలుగురు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కత్తులతో బెదిరించి దుర్మార్గంగా వ్యవహరిస్తూ అత్త, కోడలిపై అత్యాచారం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


Also Read: Andhra Pradesh : ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?


బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. పొట్టకూటి కోసం వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తే తమ జీవితాలు నాశనం అయ్యాయని చెప్పారు. కుటుంబంలోని బాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకుకి వారు విజ్ఞప్తి చేశారు.  కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఉపాధి కోసం చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లి గ్రామానికి వచ్చారు. వాచ్ మెన్ గా చేస్తున్నారు. కాగా, ఏపీలో నిత్యం ఏదో ఓ చోట బాలికలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుండటం కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని వైసీసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


Also Read: Devaragattu Bunny Festival: నేడు కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం, రాత్రికి 3 గ్రామాల మధ్య దేవర సినిమా లాంటి సీన్లు