Wife alimony harassment :  పెళ్లి తర్వాత దంపతుల మధ్య ఏర్పడే విబేధాల కారణంగా మానసిక ఒత్తిడికి గురై చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది.  భరణం పెద్ద మొత్తంలో ఇవ్వాలని విడిపోవాలనుకున్న భార్యలు హరాస్ చేస్తూండటంతో భర్తలు తట్టుకోలేకపోతారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి జరుగుతున్నాయి. తాజాగా  కర్ణాటకలోని హుబ్బళ్లిలోని ఓ వ్యక్తి ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన లేఖ కూడా వైరల్ అవుతోందది.                    
 
 బెంగళూరులోని  హుబ్బళ్లిలో కుటుబంసభ్యులంతా చర్చికి వెళ్లిన సమయంలో పీటర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చర్చి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబసభ్యులు ఉరి వేసుకున్న్ పీటర్ ను చూసి షాక్ కు గురయ్యారు.అయితే పక్కన ఉన్న లెటర్ ను చూసి వారి ఆవేదన మరింత రెట్టింపు అయింది.తన  భార్య చచ్చిపోమని చెప్పిందని.. తాను చచ్చిపోతున్నానని.. తన లేఖను తన సమాధిపై అంటించాలని ఆ లేఖలో చివరి కోరికగా కోరాడు.                      


పీటర్ గొల్లపల్లికి రెండేళ్ల కిందటే పెళ్లి అయింది. అయితే భార్యతో సరిపడలేదు. పెద్దలు సర్ది చెప్పాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి పీటర్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకులు ఇవ్వాలంటే ఆస్తులతో పాటు ఇరవై లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. చివరికి ఇద్దరి మధ్య వాగ్వాదంలో ఆమె చనిపోమని చెప్పడంతో పీటర్ మనస్థాపానికి గురయ్యాడు. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబంలో అందరూ చర్చికి వెళ్లిన తర్వాత మంచి సమయం అని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.                             


అయితే తన భార్య వేధింపుల గురించి ఆయన బయట ప్రపంచం మొత్తానికి తెలియాలనుకున్నాడు. అందుకే సమగ్రమైన లేఖ రాశాడు.  ‘‘నాన్న.. నన్ను క్షమించు. నా భార్య నన్ను చిత్రహింసలకు గురిచేస్తుంది. ఆమె నా చావును కోరుకుంటుంది. నా భార్య వేధింపుల కారణంగా నేను చనిపోతున్నాను. ఆమె వేధింపుల వల్లే చనిపోయానని నా శవ పేటిక, సమాధిపై రాయించండి’’ అంటూ పీటర్ లేఖలో పేర్కొన్నాడు.
 
భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవులు జరుగుతున్నాయని, మూడు నెలలుగా వారిద్దరూ వేరుగా ఉంటున్నాడని పీటర్ సోదరుడు పోలీసులకు పిర్యాదు చేశాడు.  వారిద్దరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. విడాకుల కేసులో రూ.20లక్షల భరణం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. ఆ కారణంగానే పీటర్ తీవ్ర ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడినట్లు జోయల్  ఫిర్యాదులో పేర్కొన్నారు.  


అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అలాంటి ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. మగ వాళ్లకు రక్షణ కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది. 



Also Read: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు