Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
Operation Kagar: దండకారణ్య అడువుల్లో మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతోంది. ఆపరేషన్ కగార్ ప్రభావంతో మవోయిస్టుల అంతం చివరి దశకు చేరుకుందని అమిత్ అంటున్నారు. మావోలకు ఇవి ఆఖరి రోజులా..

వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు నేల కూలుతున్నారు. పిట్టల్లా రాలిపోతున్నా మావోయిస్టు గ్రూపులు తమ పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల అంతమే తమ లక్ష్యమని చెబుతోంది. మాజీ నక్సలైట్, మావోయిస్టుపార్టీ మాజీ కేంద్రకమిటీ సభ్యుడు జంపన్న ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
ఏబీపీ దేశం: 2026 నాటికి మావోయిస్టులను అంతం చేస్తాం అంటున్నారు అమిత్ షా, ఈ ప్రకటనల వెనుక బిజేపి ఉద్దేశ్యం ఏంటి, వరుస ఎన్ కౌంటర్ల ప్రభావం మావోలపై ఎలా ఉంది..?
జంపన్న: ఒక ఎన్ కౌంటర్ మూడు రోజులపైగా కొనసాగడం విచత్రంగా ఉంది. అత్యాధునిక ఆయుధాలున్నాయి. డ్రోన్ల ద్వారా కేంద్రబలగాలు నక్సలైట్లపై బాంబింగ్ చేస్తున్నాయి. కేవలం రెండు లేదా మూడు గంటల్లో దాడులు చేసిన ప్రాంతాలను క్లీయర్ చేయగలుగుతున్నారు. కానీ మూడు రోజులపాటు వరుసగా సంఖ్యను పెంచుతున్నారు దీనిని ఏవిధంగా అర్దం చేసుకోవాలి. సున్నవేడ గుట్టపై ముఫై గ్రామాలు ఉంటాయి. ఓ గంటపాటు ఎక్కితేనే అక్కడకు చేరుకోగలుగుతారు. అలాంటిది రొోజులతరబడి ఒక్కొక్కటిగా మావొోల శవాల లెక్కలు పెంచుతూ పోతున్నారంటే ఇవి ఎన్ కౌంటర్లు కాదు. చుట్టుముట్టి రాపిడ్ ఫైర్ చేయడాన్ని యుధ్దం అంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. సొంత ప్రజలపై యుద్దం చేయకూడదు.కానీ కేంద్రం చట్టఉల్లంఘన చేస్తొంది.
కళ్లులేని వ్యక్తిని ,కనీసం తుపాకీ కూడా పట్టుకోలేని వ్యక్తులను ఈడ్చుకొచ్చి కాల్చి చంపేస్తున్నారు. మోకాళ్ల సమస్య ఉండి ,రెండు కట్టెలు పట్టుకుని నడిచే వారిని సైతం ఎన్ కౌంటర్ పేరుతోె అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. కేవలం 20 లేదా 30 మంది మావోయిస్టులపైన వేలాది బలగాలాను అక్కడకు మోహరించి, బాంబులతో దాడిచేసి చంపడం అనేిది ఏ యుద్దం విధానం.కేంద్రం ఇలా వ్యవహరించడం సరికాదు. - మాజీ నక్సలైట్, మావోయిస్టుపార్టీ మాజీ కేంద్రకమిటీ సభ్యుడు, తెలంగాణ.
ఏబీపీ దేశం: కేంద్రప్రభుత్వం మావోయిస్టులపై ఎందుకింత పగపట్టింది. అడవులలో అన్నలు లేకపోతే కేంద్రానికి కలిగే లాభమేంటి..?
జంపన్న: ఛత్తీస్ ఘడ్ లోపల భారీ స్దాయిలో మైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎన్ కౌంటర్లు జరుగుతున్న దండకారణ్య అడవుల్లో భారీగా ఇనుము, ఖనిజ నిక్షేపాలున్నాయి. వాటిపై అధాని, అంబాని వంటి కార్పొరేట్ పెత్తందార్లు కన్నుపడింది. అడవులలోె గిరిజనులకు అండగా ఉండే మావోయిస్టులు అక్కడ పెత్తందార్లకు అడ్డుగా మారారు. కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న మైనింగ్ ను మావోయిస్టులు అడ్డుకోవడం కేంద్రానికి మింగుడుపడటంలేదు. అక్కడ అటవీప్రాంతాల్లో ఇలా భారీ ఎత్తున మైనింగ్ చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో అడవులను నమ్ముకున్న గిరిజనులు నిర్వాసితులవుతారు. వ్యవసాయం నడవదు.త్రాగేనీరు కూడా కలుషితమువుతుంది. అందుకే మైనింగ్ కు వ్యతిరేకంగా మావొయిస్టులు పోరాడుతున్నారు.
ఏబీపీ దేశం: అడవుల్లో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడానికి కోర్టులు, చట్టాలు ఉన్నాయి. వాటి ద్వారా అడవుల్లో మైనింగ్ ను అడ్డుకోవచ్చు. దశాబ్దాల క్రితం అడవుల్లో పరిస్దితులు వేరు, ఇప్పుడు వేరు. సోషల్ మీడియా ప్రభావం ఈ రోజుల్లో ఉంది. మావోలు ఇలా పోరాట పందా మార్చుకోవచ్చు కదా..?
జంపన్న: తప్పనిసరి పరిస్దితుల్లో మావోయిస్టులగా మారి ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది. ఓ పార్టీగా ఏర్పడ్డారు. దానిని కొనసాగిస్తున్నారు.ఈ రోజుల్లో భూస్వామ్య వ్యవస్ద వ్యవస్ద లేదు,కానీ పెట్టుబడీదారి వ్యవస్ద ప్రమాదకరంగా మారింది. ఈరోజుల్లో ప్రజాసంపద దోపిడీ విధానం మారింది. ప్రజాస్వామ్య వ్యవస్ద ఉన్నా లేనట్టే. గతంలో వచ్చినట్లు ఇప్పుడు మావోయిస్టులలోకి రావడంలేదు. మావోలలోె చేరేవారి సంఖ్య తగ్గింది.దీనికి కారణం ప్రజలు ఆయుధాలు పట్టుకునేందుకు సిద్దంగా లేరు. ఈ మార్పు ఉన్నమాట వాస్తవమే. కేవలం కేసులు వేసి పోరాటం చేయలేరు.
మైనింగ్ కు వ్యతిరేకంగా వేలాది మంది ర్యాలీలు చేసారు. అడవుల్లో అన్యాయంపై కేంద్రం చర్యలు తీసుకొకుండా ప్రశ్నించిన మావొయిస్టులపై దాడులు చేయడమంటే కార్పొరేట్ దోపిడీదార్లుకు కొమ్ముకాస్తున్నట్లని స్పష్టంగా అర్దమవుతోంది. వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, అత్యాధునిక ఆయుధాలు పెట్టి ,మావోలను నిర్మూలించడం అనేది దారుణం. మావోల సమస్య అనేది ఆర్దిక ,రాజకీయ సమస్య , దానికి కేంద్ర పరిష్కారం చూపాలి,కానీ ఏకంగా నిర్మూలించడం అనేది తప్పుడు విధానం.
ఏబీపీ దేశం: ఆపరేషన్ కగార్ కు ముందు అనేక ఆపరేషన్లు జరిగాయి,కానీ ఇంతలా మావోల ఉనికిపై మరేది ప్రభావం చూపలేదు. దారుణంగా మావోలను కాల్చి చంపేస్తున్నారు. ఇక్కడ లోపం ఎక్కడ ఉంది..?
జంపన్న: మావోస్టులను నిర్మూలించాలి అనే బిజేపి ఆలోచన ఇది మొదటిసారి కాదు, ఇదే చివరి సారికూడా కాబోదు.1970లో నక్సలైట్ ఉద్యమం పుట్టింది. బెంగాల్ లోని ఓ చిన్న ప్రాంతంలో పుట్టి దేశవ్యాప్తంగా విస్తరించింది. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ ఉంది. అప్పట్లో ఆమె ప్రభుత్వంలో కూడా కొందరు నక్సలైట్లను హతమార్చింది,కానీ పూర్తిగా నిర్మూలించలేకపోయింది.అప్పట్లో మావొోయిస్టు పార్టీ మళ్లీ పుంజుకుంది. దేశవ్యప్తంగా విస్తరించింది. దేశంలో దోపిడి, అణచివేత ఉన్నప్పుడు ఉద్యమాలు పుట్టుకొస్తాయి.పార్టీలు పుట్టుకొస్తాయి. అన్నల అంతుచూస్తామంటూ ప్రజల చేత ఎన్నికలైన ప్రభుత్వాలు ఇలా వ్యవహరించడం సరికాదు.