Severe Fire Accident In Hussian Sagar: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ (Hussian Sagar) లోపల ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'భారత మాతకు మహా హారతి' కార్యక్రమంలో అపశ్రుతి నెలకొంది. ఈ కార్యక్రమ నిర్వాహకులు భారీగా బాణాసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుండగా.. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోట్లలో ఉన్న 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Also Read: Hyderabad News: 'ఈ కోడిని కోయనంటే కోయను' - ఏ చేస్తానో తెలుసా?, కోడి పుంజుకు వ్యక్తి ఘన సన్మానం