AP News : ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత వెలకట్టలేనిది. పిల్లల సంతోషమే తమ సంతోషంగా భావించి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. తమ పిల్లలకు చిన్నపాటి కష్టం వచ్చినా ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. చిన్నతనం నుంచి అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో జీర్ణించుకోలేక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 


అసలేం జరిగిందంటే? 


అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్ లో వై.కృష్ణ(50), రమణమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. కృష్ణ మదనపల్లెలోని మార్కెట్ యార్డులో కూలీగా పనిచేస్తూ కుమార్తెను, కుమారుడిని ఉన్నత చదువులు చదివించారు. చిన్నతనం నుంచే చదువులో రాణించడంతో  కుమారుడు సురేష్ ఉన్నత చదువులు చదివించారు. అందుకోసం అప్పులు చేశారు. కుమార్తెను తమ బంధువులను ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. ఒక్కగానొక్క కొడుకు సురేష్ కు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇన్నాళ్లకు తమ కష్టాలు తీరాయని భావించిన కృష్ణ, రమణమ్మ దంపతుల ఆశలు అంతలోనే అడియాశలు       అయ్యాయి. సురేష్ కి ఉద్యోగం వచ్చిన కొన్నాళ్లకే అనారోగ్యంతో మృతి చెందాడు. ఎన్నో ఆశలు పెంచుకున్న కుమారుడు కళ్ల ముందే మృతి చెందడంతో కుంగిపోయిన ఆ దంపతులు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. 


ఆగని ఆన్‌లైన్ లోన్‌ యాప్‌ వేధింపులు, వివాహిత బలవన్మరణం - వాట్సప్‌లో అసభ్య మెసేజ్‌లు!


ఉరి వేసుకుని ఆత్మహత్య 


తమ కుమారుడు లేని బతుకు తమకు ఎందుకని భావించి ఓ లేఖ రాసి ఇళ్లు వదిలి పెట్టి వెళ్లిపోయారు. రెండు రోజులుగా తమ తల్లిదండ్రులు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుమార్తె ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దంపతుల ఆచూకీ కోసం ఆరా తీశారు. మంగళవారం ఉదయం బి.కొత్తకోట‌ మండలం హర్సిలీ హిల్స్ సమీపంలోని సిరికల్చర్ కార్యాలయం వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో కృష్ణ, రమణమ్మ దంపతుల మృతదేహాలు లభించాయి. చెట్టుకు ఉరి చేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


Also Read : Crime News : దొంగల్లో దరిద్రులంటే వీళ్లే - ఆర్థరాత్రి రిక్షాకు స్కెచ్చేశారు !


Also Read : కట్టుబట్టలే మిగిలినా "డేటింగ్ యాప్" మత్తులోనే పెద్ద డాక్టర్ - మగాళ్లే అని చెప్పినా వినడే !